తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి మిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వనపర్తి జిల్లా (Wanaparthy District) గోపాల్ పేట మండలం బుద్దారంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంటి పెద్దాయన సంవత్సరీకం కార్యక్రమానికి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఈ దారుణం జరిగింది. చనిపోయిన వారందరూ మహిళే కావడంతో మరింత విషాదఛాయలు అలుముకున్నాయి.
- Also Read : Samsung Chairman Dies: శాంసంగ్ ఛైర్మన్ కన్నుమూత
బుద్దారం గ్రామానికి చెందిన నర్సింహ అనే వ్యక్తి ఏడాది కిందట మరణించాడు. ఆయన సంవత్సరీకం చేయాలని, ఆ కార్యక్రమానికి నర్సింహ కుమారులు, కోడళ్లు, మనుమడు, మనవరాళ్లు ఇంటికి వచ్చారు. నర్సింహ సంవత్సరీకం కార్యక్రమం జరిపించారు. ఈ క్రమంలో గాలి వస్తుందని ఫ్యాన్ ఉన్న ఒకే గదిలో రాత్రివేళ 11మంది నిద్రించారు. ఇటీవల కురిసిన వర్షాలకు బాగా తడిచిన మట్టిమిద్దె నిద్రిస్తున్న కుటుంబసభ్యులపై ఒక్కసారిగా కూలిపోయింది.
- Also Read : ముంబై నగరంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు
ఈ ప్రమాదంలో నిద్రిస్తున్న ఇంటి యజమాని మణెమ్మ సహా అయిదుగురు మహిళలు చనిపోయారు. మణెమ్మ కోడళ్లు సుప్రజ, ఉమాదేవితో పాటు మనుమరాళ్లు అశ్విని, పింకి మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తుల సహకారంతో పోలీసులు వెలికి తీశారు. కాగా, మణెమ్మ కుమారుడు కుమార్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుమార్‌ను హైదరబాద్‌కు తరలించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe