Mulayam Singh Yadav: యూపీ మాజీ సీఎం ములాయంకు కరోనా

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక రాజకీయ నేతలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ (Mulayam Singh Yadav) కు కరోనా పాజిటివ్‌‌గా నిర్థారణ అయింది.

Last Updated : Oct 15, 2020, 04:41 AM IST
Mulayam Singh Yadav: యూపీ మాజీ సీఎం ములాయంకు కరోనా

Mulayam Singh Yadav tested Covid-19 positive: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక రాజకీయ నేతలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ (Mulayam Singh Yadav) కు కరోనా పాజిటివ్‌‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయన్ను గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ములాయంతోపాటు ఆయన సతీమణి సాధన గుప్తాకు కూడా కరోనా సోకింది. అయితే ములాయం సింగ్ యాదవ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో.. కరోనా పరీక్ష చేయించగా.. బుధవారం పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ట్విట్ చేసి తన తండ్రి ఆరోగ్యం గురించి తెలియజేశారు. Also read : Ashima Narwal smoking video: స్మోకింగ్ చేస్తూ బాలయ్య బాబు డైలాగ్ చెప్పిన హీరోయిన్

ప్రస్తుతం తన తండ్రి నేతాజీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. లక్షణాలు కూడా ఎం కనిపించలేదని.. అయితే కరోనా పాజిటివ్‌గా వచ్చిన నేపథ్యంలో గుర్గావ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించినట్లు వెల్లడించారు. నిరంతరం తాము సీనియర్ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. నేతాజీ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంటామంటూ.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. అయితే ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం యుపి మెయిన్పురి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. Also read : Vijay Sethupathi: ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అంటూ.. నెటిజన్ల ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News