హుస్సేన్ సాగర్ బుద్ధుడిని దర్శించిన రాష్ట్రపతి

ప్రపంచ తెలుగు మహాసభల ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ బుధవారం హుస్సేన్‌సాగర్‌లో బుద్ధవిగ్రహానికి పుష్పమాలలు వేసి తథాగతునికి నివాళులు అర్పించారు.

Last Updated : Dec 21, 2017, 09:07 PM IST
 హుస్సేన్ సాగర్ బుద్ధుడిని దర్శించిన రాష్ట్రపతి

ప్రపంచ తెలుగు మహాసభల ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ బుధవారం హుస్సేన్‌సాగర్‌లో బుద్ధవిగ్రహానికి పుష్పమాలలు వేసి తథాగతునికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాగ్యనగరంలోని బౌద్ధ గురువులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా బుద్ధవనం ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన తన అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రిస్టియానా జెడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.

 

 

Trending News