కేజీఎఫ్ ( KGF ) స్టార్ యష్ తన కుటుంబంతో కలిసి సరదాగా బెంగుళూరులో ఉన్న తన ఫామ్ హౌజ్ లో సమయం గడుపుతున్నాడు. యష్ భార్య, నటి రాధికా పండిత్ ( Radhika Pandit ) తన ఇంస్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ఇందులో హీరో యష్ తన గారాలపట్టి ఐరాతో ఆడుకోవడం చూడవచ్చు. తండ్రి కూతురు కలిసి బుజ్జి దూడకు అరటిపండు తినిపిస్తున్నారు. నేచర్ అన్నా.. వ్యవసాయం అన్నా ఇష్టపడే యష్ ( Yash ) తరచూ తన ఫామ్ హౌజ్ లో సమయం వెచ్చిస్తుంటాడు. దాంతో పాటు అనేక జిల్లాల్లో రైతులకు సహాయం చేసిన మంచి మనసు అతనిది.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో యష్ ఎక్కువగా ఈ ఫామ్ హౌజ్ లో గడిపాడు. తన కుటుంబంతో కలిసి ఇక్కడ నేచర్ లవర్ గా మంచి సమయం గడిపినట్టు సమాచారం. ఫ్యామిలీమేన్ గా గుర్తింపు తెచ్చుకున్న యష్ తరచూ తన కుటుంబంతో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంటాడు. యష్ భార్య రాధికా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.