కరోనా వైరస్ ( Corona Virus ) కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ నుంచి ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ ( Unlock ) కొనసాగుతోంది. అన్‌లాక్ 3లో భాగంగా జిమ్‌లు, యోగా సెంటర్లను ప్రారంభించేందుకు అనుమతి లభించింది. అయితే జిమ్‌లకు వెళ్లాలంటే ఆ మూడూ ఉండాల్సిందేనంటోంది ప్రభుత్వం..
అన్‌లాక్ 3 ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు , యోగా సెంటర్లు ( Gyms and yoga centres ) తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అయితే వీటికోసం కొన్ని మార్గదర్శకాల్ని ( Guidelines ) విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. జాగ్రత్తలు పాటించాలని సూచించింది. జిమ్ ట్రైనర్లు, సిబ్బంది సహా అందరూ సామాజిక దూరం ( Social Distance ) పాటించాలని తెలిపింది. మాస్క్ ( Mask ) తప్పనిసరిగా ధరించాలని, ప్రతి ఒక్కరి మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ ( Arogya setu app ) ఉండాలని గైడ్ లైన్స్ లో ఉంది. కంటెయిన్మెంట్ జోన్‌లకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. స్పాలు, స్విమ్మింగ్ ఫూల్‌లు మాత్రం అప్పుడే తెర్చుకోవు. Also read: Jammu Kashmir: ప్రపంచపు అతి ఎత్తైన వంతెన త్వరలో పూర్తి
65 ఏళ్లు పైబడినవారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు వయస్సు పిల్లలు క్లోజ్డ్ జిమ్స్ ఉపయోగించకూడదు. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమైతే మాస్క్‌కు బదులు విజర్ వాడవచ్చు. యోగా, జిమ్‌లలో వ్యక్తుల మధ్య నాలుగు మీటర్ల దూరం ఉండాలి. పరికరాల్ని ఆరడుగుల దూరంలో ఉండటమే కాకుండా ఓపెన్ ప్లేస్‌లో ఉంచాలి. ఎగ్జిట్, ఎంట్రీ ప్రత్యేక మార్గాల్ని ఏర్పాటు చేయాలి. ఉష్ణోగ్రతను 24-30 డిగ్రీల మధ్య ఉంచాలి. ఎంట్రన్స్ వద్ద శానిటైజర్ డిస్పెన్సర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు తప్పనిసరి. జిమ్ పరికరాల్ని, ఫ్లోర్ ను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. Also read: Rakhi: గట్టి దెబ్బే తగిలింది, 4 వేల కోట్ల నష్టం
జిమ్‌కు వెళ్లాలంటే ఆ మూడూ ఉండాల్సిందే