ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి ( Ap Opposition leader Chandrababu ) పైశాచిక ఆనందంలో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ( Health Minister Alla nani ) ఆళ్లనాని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతి పది సెకన్లను ఒకరు కరోనా కారణంగా చనిపోతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని తీవ్రంగా స్పందించారు.
ఏపీలో కరోనా కేసులు, మరణాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ( ycp leaders ) విరుచుకుపడుతున్నారు. నిన్న మంత్రి కన్నబాబు..ఇవాళ మంత్రి ఆళ్లనాని. టీడీపీ అధినేత చంద్రబాబుది పైశాచిక ఆనందమని మంత్రి ఆళ్లనాని ధ్వజమెత్తారు. విపత్కర పరిస్థితుల్లో సైతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ..రాజకీయ లబ్ది కోస ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజూ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేస్తున్న మెడికల్ బుల్లెటిన్ చూసి మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) సమర్ధవంతమైన పాలన చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.అవాస్తవాలు చెబుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి నాని దుయ్యబట్టారు. Also read: Ap Minister: చంద్రబాబు విజ్ఞత కోల్పోయారు
చంద్రబాబు హయాంలో ఆసుపత్రుల్ని గాలికొదిలేయడమే కాకుండా..అన్ని వైద్య సేవల్ని నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా
ఏ రాష్ట్రంలోనూ చేయనన్ని పరీక్షలు ఏపీలో చేస్తున్న సంగతి ప్రజలకు తెలుసన్నారు. రోజుకు 50 వేల పరీక్షలు చేసేలా సామర్ధ్యాన్ని పెంచామన్నారు. కేవలం పరీక్షల కోసమే రోజుకు 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.