/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Coronavirus: జెనీవా: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (  WHO ) ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న కేసులతో మునుపటిలా పరిస్థితులు సర్వసాధారణం అయ్యే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. ప్రాథమిక జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మున్ముందు ఈ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ ( Tedros Adhanom ) ఆందోళన వ్యక్తంచేశారు. Also read: COVID-19: ఇక కరోనా ఉగ్రరూపం: WHO

సోమవారం జరిగిన సమావేవంలో డాక్ట‌ర్ టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి ఘోరంగా పెరుగుతోందని, ఇప్పట్లో మునుపటి పరిస్థితి వచ్చేలా కనిపించడం లేదన్నారు. ఈ మహమ్మారిని అరికట్టే విషయంలో చాలా దేశాలు తప్పుడు విధానాలను పాటిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని హెచ్చరించారు. శీతాకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి మరింత పెరుగుతుందని ఇప్పటినుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

వరల్డ్‌మీటర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,32,36,252 మందికి కరోనా సోకగా.. ఈ మహమ్మారితో 5,75,540 మంది మరణించారు. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 76,91,451 మంది కోలుకున్నారు.  Also read: UK: చైనాకు నో అంటున్న బ్రిటన్

Section: 
English Title: 
Old normal is not possible in near future: who chief Tedros Adhanom
News Source: 
Home Title: 

COVID-19: పరిస్థితి ఇక అప్పటిలా ఉండదు: WHO

COVID-19: పరిస్థితి ఇక అప్పటిలా ఉండదు: WHO
Caption: 
File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
COVID-19: పరిస్థితి ఇక అప్పటిలా ఉండదు: WHO
Publish Later: 
No
Publish At: 
Tuesday, July 14, 2020 - 16:50