Sweet Potatoes Health Benefits: శివరాత్రి రానుంది.. ఆరోజు చిలకడ దుంపను తప్పకుండా తీసుకుంటారు.. ఇందులో పోషకాలకు పవర్ హౌస్ అయిన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది తీయగా కూడా ఉంటుంది అందుకే తినటానికి ఇష్టపడతారు. అయితే ఈ చిలగడం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతిలో చిలగడ దుంప ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తుంటారు. దీన్ని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు ఇంకా విటమిన్ ఏ, బి, సి, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, విటమిన్ ఇ కూడా దొరుకుతుంది. అంతేకాదు ఇందులో బీటా కెరటిన్, క్లోరోజోనిక్ యాసిడ్, ఆంథోనీసైన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల పుష్కల ఆరోగ్య ప్రయోజనాలు.
చిలకడదుంపను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. దీంతో డయాబెటిస్ వారు కూడా నిక్షేపంగా తీసుకోవచ్చు.. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉంటుంది. 44 నుంచి 96 మధ్య జీఐ ఉంటుంది. డయాబెటిస్ వారు దీన్ని స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్, మెటబాలిజం రక్తంలో షుగర్‌ను నిర్వహిస్తుంది. హఠాత్తుగా షుగర్ స్థాయిలు పెరగనివ్వకుండా కాపాడుతుంది.
చిలగడ దుంపలు జీర్ణ ఆరోగ్యానికి పనిచేస్తాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇందులో కరిగే, కరగని రెండూ ఫైబర్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ముఖ్యంగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు చిలగడ దుంపను తీసుకోవడం వల్ల ఇందులోనే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.. దీంతో అతిగా వేరే అనారోగ్యకరమైన ఆహారాలు తినకుండా ఉంటారు. మీ డైలీ డైట్ లో చిలగడ దుంప చేర్చుకోవాలి. ఈ సీజన్ లో విరివిగా మార్కెట్లో లభిస్తాయి.
ఇదీ చదవండి: జీరో బడ్జెట్ లైఫ్‌స్టైల్.. ఈ ఆకు మీ ఇంట్లో ఉంటే 100 రోగాలు పరార్..!
రెగ్యులర్‌గా చిలగడ దుంపలు తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ b6 గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో హోమోసిస్టెంట్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండెకు సంబంధించింది అంతే కాదు ఇందులో పొటాషియం కూడా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. చిలగడ దుంపను తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఇన్ప్లమెటరీ గుణాలు ఉంటాయి. ఇది స్ట్రెస్ నివారిస్తుంది. తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. దీంతో సీజనల్ జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: Rose Water: ఈ నీరు ఉంటే చాలు.. ఏ ఫేస్ క్రీముల అవసరం ఉండదు..
అంతేకాదు చిలగడ దుంప క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కెరోటినాయిడ్స్ ఇది కడుపు, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యను రాకుండా నివారిస్తుంది. చిలగడ దుంపలో బ్లూబెర్రీ కి మూడింతల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.. వీటిని ఉడికించి తీసుకోవచ్చు. లేదంటే ఉడికించి లేదా ఇతర రిసిపీలు తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇందులో ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇంకా ఉపవాసాలు ఉన్న సమయంలో వీటిని తీసుకుంటే మంచి సూపర్ ఫుడ్ లా పనిచేసి తక్షణ శక్తిని అందిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.