Very Rare Black King Cobra Video Watch: సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వీడియోలు పడితే అలాంటి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాములకు సంబంధించిన వీడియోలు అయితే షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ దాటిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. చాలామంది పాములను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని.. కొంతమంది స్నేక్ క్యాచర్స్ వాటిని పట్టుకునే క్రమంలో తీసిన కొన్ని వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అలాగే కొంతమంది చాలా అరుదుగా కనిపించే పాములకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసినవి కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలని సోషల్ మీడియా వినియోగదారులు ఆసక్తిగా ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతూ ఉంటున్నారు. ఇటీవలే ఓ పాముకు సంబంధించిన వీడియోను కూడా నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.. ఇంతకీ ఆ పాము వీడియో ఏంటో ఇప్పుడు మీరు కూడా చూడండి..
పాములు అరదుగా ఒక చోటి నుంచి మరొక చోటికి వెళ్తూ ఉంటాయి. కొన్ని పాములు అయితే నీటిలో కూడా ఈదుతూ ఇతర ప్రదేశాలకు చేరుతూ ఉంటాయి. ఈదడంలో కొన్ని పాములు ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి పాముల్లోనే ఇటీవల వైరల్ అవుతున్న పాము ఒకటి.. వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో చాలా అరుదైన వైల్డ్ కింగ్ కోబ్రా మీరు గమనించవచ్చు. అయితే ఈ కోబ్రా అటు ఇటు తలను ఊపడం కూడా మీరు చూడవచ్చు. ఈ పాముకు ఒక అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. అది ఏంటో కాదు.. పాము ఎంతో సులభంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఈదుతూ వెళ్తుంది. ఇలా ఈదుతో వెళుతూ దానికి కావలసిన ఆహారాలను నీటిలోనే పట్టుకుని చంపి తింటుందట.. ప్రస్తుతం ఈ ఈదుతూ వెళ్తున్న పాముకు సంబంధించిన ఓ రీల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?
ఇలా ఈదుతూ వెళ్లే పాములను మనం చాలా అరుదుగా చూస్తుంటాం.. ఎందుకంటే కేవలం ఇవి అమెజాన్ అడవులలో మాత్రమే లభిస్తాయి. కాబట్టి చిత్తడి నేలల్లో తిరిగే పాములకు ఇలాంటి సామర్థ్యం ఉంటుంది. ఈ వీడియోలో మీరు పాములు గమనిస్తే.. పాము తన మొండెం భాగంలో అరుదైన చారలను కలిగి ఉంది. రెండు తెలుపు రంగులో కూడిన చారలను మీరు చూడవచ్చు. నిజానికి ఇలాంటి చారలు కలిగిన పాములు చాలా అరుదుగా ఉంటాయని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇలాంటి పాములు జన సందోహాల్లోకి అరుదుగా వస్తాయని వారు అంటున్నారు. అంతేకాకుండా ఇది అన్ని పాముల కంటే చాలా అతి భయంకరమైన పామని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను @theworldtour అనే యూట్యూబ్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 29 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. దీనిని కొన్నివేల మందికి పైగా వీక్షించినట్లు సమాచారం.
AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి