TTD Darshan Tickets: ప్రతి సారీ వేసవి కాలంలో తిరుమలలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. పరీక్షలు ముగిసి సెలవులు వచ్చేయడంతో స్వామి దర్శనం కోసం తిరుమలకు పోటెత్తుతుంటారు. అందుకే భక్తుల రద్దీకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల భక్తుల కోసం ప్రత్యేక దర్శన కోటా విడుదల చేస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం మార్చ్, ఏప్రిల్ రెండు నెలలకు సంబంధించి శ్రీవారి దర్శనం, శ్రీవారి సేవ, వసతి కోటా ఇప్పటికే విడుదల అయింది. ఇక మే నెల కోటాను ఆన్లైన్లో ఈనెల 18వ తేదీ రేపటి నుంచి అందుబాటులో రానుంది.మే నెలకు సంబంధించిన తోమాల, అష్టాదల పాదపద్మ ఆరాధన కోటా కూడా విడుదల కానుంది. ఫిబ్రవరి 18 నుంచి ఉదయం 10 గంటల నుంచి టోకెన్లు ఆన్లైన్లో తీసుకోవచ్చు.
ప్రత్యేక టికెట్లు ఎలా తీసుకోవాలి
ఫిబ్రవరి 18 నుంచి 20 తేదీ వరకు ఈ సేవా టికెట్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 22వ తేదీ మద్యాహ్నం 12 గంటల వరకు డబ్బులు చెల్లించాలి. లక్కీ డిప్లో ఎంపికైనవారికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు. శ్రీవారి కళ్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్ర దీపారాధన టోకెన్లు ఫిబ్రవరి 21 న విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 22న మాత్రం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదలవుతాయి. దివ్యాంగులు, వృద్ధుల టోకెన్లు కూడా ఫిబ్రవరి 22 మద్యాహ్నం విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24వ తేదీన ప్రత్యేక దర్శనం 300 రూపాయల టోకన్లు జారీ కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. ఇక మద్యాహ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్ ఉంటుంది.
ఇవన్నీ మే నెల కోటాకు సంబంధించినవి. అంటే వేసవిలో తిరుమల దర్శనం ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి. మే నెలలో తిరుమల దర్శనం ప్లాన్ చేస్తుంటే ttddevsthan.ap.gov.in వెబ్సైట్ ద్వారా టోకెన్లు పొందవచ్చు. టికెట్లు పొందిన తరువాత మే నెలలో తిరుమలను సందర్శించినప్పుడు నిర్దేశిత సమయానికి క్యూ లైన్లలో చేరాల్సి ఉంటుంది.
Also read: Delhi Earth Quake: ఢిల్లీలో భూకంపం, భయంకర శబ్దం..మరోసారి వచ్చే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి