Chhaava Release: చావా సినిమా మరో రెండు రోజుల్లో అభిమానుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా హీరో విక్కి కౌశాల్ నేషనల్ క్రష్ పై నోరు పారేసుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విక్కికౌశాల్ హీరోగా చావా మూవీ అభిమానుల ముందుకు ఫిబ్రవరి 14న రానుంది. ఈ మూవీ శివాజీ పంత్ మరాఠి నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.
మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ ఆయన సతీమణి యేసుబాయ్ ల పాత్రల్లో విక్కి కౌశాల్, రష్మిక మందన్న చేశారు. ఈ మూవీకి ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించారు.
ఈ సినిమాలో.. ఔరంగా జేబ్ పాత్రలో అక్షయ్ కుమార్ కన్పించనున్నారు. అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటీ తదితరులు ఈ మూవీలో నటించారు. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లలో ఇటీవల రష్మిక మందన్న తన కాలి నొప్పితోనే పాల్గొంది.
రష్మిక మందన్న ఇటీవల జిమ్ చేస్తుఉండగా ఆమె కాలు ఫ్యాక్చర్ అయ్యింది. ఆమెను వైద్యులు బెడ్ రెస్ట్ తీసుకొవాలన్నారు. కానీ ఆమె మాత్రం చావా కోసం ప్రమోషన్ లలో కుంటుకుంటునే ప్రొగ్రామ్ లలో పాల్గొన్నారు. సదరు ప్రొగ్రామ్ లలో విక్కి కౌశాల్ ఆమె చేయ్యిపట్టుకుని మరీ వేదికల మీదకు తీసుకెళ్లి చైర్ లో కూర్చొబెట్టాడు.
ముఖ్యంగా రష్మిక మందన్న కుంటుకుంటునే ప్రమోషన్ లలో పాల్గొనడంపై విక్కి కౌశాల్ కాస్తంత అసహానం వ్యక్తం చేశాడంట. డాక్టర్ లు చెప్పినట్లు బెడ్ రెస్ట్ తీసుకొవచ్చు కదా.. ఇలా పబ్లిసిటీ ఎందుకని ఆయన అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిలో ఎంత నిజముందో కానీ ...ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
మరోవైపు రష్మిక అభిమానులు సైతం గతంలో.. అంతగా కాలు నొప్పి ఉన్నప్పుడు రెస్ట్ తీసుకొవచ్చు కదా.. అంటూ గతంలో కొంత మంది సలహా ఇచ్చారు. మరికొందరు మాత్రం.. అంతటి కాలి నొప్పిలో సైతం ఆమె ప్రమోషన్ లలొ పాల్గొంటుందంటే.. ఆమె డెడికేషన్ చూడండని కౌంటర్ లు వేస్తున్నారు. మొత్తానికి మరో రెండు రోజుల్లో చావా విడుదల నేపథ్యంలో రష్మిక మందన్న అంశం వార్తలలో నిలిచింది.