AP: బాబోయ్‌ మండే ఎండలు.. వేడి వాతావరణం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

AP Hot Weather: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ ప్రభావం పెరిగి ఉక్కపోత మరో రెండు రోజులు ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

మొన్నటి వరకు చలి చంపేసింది. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనాల వల్ల భారీ వర్షాలు, వరదలు అతలాకుతులం చేశాయి. ఈ నేపథ్యంలో ఎండలు కూడా ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

2 /5

ఎండల తీవ్రత ఫిబ్రవరి ప్రారంభానికి ముందే మొదలయింది. ఇక రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వేడి పెరగనుంది.  

3 /5

పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో రెండు డిగ్రీలు ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది వాతావరణ శాఖ.  

4 /5

నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు మరికొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీలు కూడా పెరిగింది. నందిగామ వంటి ప్రాంతాల్లో ఐదు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వరుసగా అత్యధికంగా 37 డిగ్రీలకు పైగా నమోదు అయింది.  

5 /5

ఈనేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఇక ఎండకాలం శివరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. కానీ, అంతకు ముందే ఎండ తీవ్రత పెరిగింది.