Egg Cooking Scientific Method: ఆహారాల్లో ఎన్నో పోషకాలు కలిగిన పదార్థం గుడ్డు. కోడి నుంచి వచ్చే గుడ్డును ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి. గుడ్డును ఏ విధంగా తిన్నా ఆరోగ్యానికి ప్రయోజనమే! కానీ ఉడికించుకుని తింటే మాత్రం ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కోడి గుడ్డును ఉడికించడం చాలా సులువు. ఏముంది నీళ్లు పోసి.. కొంత ఉప్పు వేసి కొన్ని నిమిషాలు ఉడికిస్తే చాలు. ఇది అందరూ చేస్తున్న పనే. కానీ ఈ పద్ధతి తప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుడ్డును ఉడికించడం సాధారణ విషయం కాదని తేల్చి చెప్పారు. గుడ్డు ఉడకబెట్టే విధానాన్ని శాస్త్రవేత్తలు వివరించారు.
Also Read: Google YouTube Bonalu: 'గూగుల్ అమ్మ, యూట్యూబ్ తల్లి బోనాలు'.. వీటి ప్రత్యేక ఏమిటో తెలుసా?
గుడ్డులో పోషకాలు, రంగు రుచితో ఉండాలంటే మాత్రం గుడ్డును ఉడికించే పద్ధతి వేరు అంటూ అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. గుడ్డులో రెండు సోనలు ఉంటాయి. ఆ రెండు సోనలు వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉడుకుతాయి. రెండూ ఒకే ఉష్ణోగ్రతలు ఉడకవని తేల్చి చెప్పారు. గుడ్డు బాగా ఉడికింది అని చెప్పడానికి 'పచ్చ సోన మృదువుగా ఉంటుంది. తెల్ల సొన మెత్తగా.. దట్టమైన తెలుపుతో ఉండాలి' అని చెబుతున్నారు.
Also Read: Viral Video: బుడ్డోడి దేశభక్తికి 'భరతమాత' ఫిదా.. నెట్టింట్లో వైరల్‌గా వీడియో
కోడిగుడ్డు వలన బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గుడ్డును సరిగ్గా ఉడికించాలి. అంతేకాకుండా గుడ్డులోని పోషకాలు నశించకుండా.. రుచి పాడవకుండా గుడ్డును ఉడికించడంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఉడికించే విధానంపై కొన్ని వేల గుడ్లను ఉడికించి శాస్త్రవేత్తలు పరిశోధించారు. వివిధ రకాలుగా గుడ్డు ఉడికించి వాటిలోని పోషకాలు, రుచి చూశారు. అనంతరం చివరికి ఒక పద్ధతిని కనిపెట్టారు. గుడ్డును ఉడికించడంపై పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్తలు ఈ విధంగా చెప్పారు.
గుడ్డును ఉడికించే శాస్త్రీయ పద్ధతి
- రెండు పాత్రలు తీసుకోవాలి. ఒక పాత్రలో నీళ్లు బాగా మరిగించాలి. మరో పాత్రలో గోరు వెచ్చటి నీరు ఉంచాలి.
- మొదట మరుగుతున్న నీటిలో మొదట వేయాలి. అనంతరం రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటిలో గుడ్డును ఉడికించాలి.
- ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మరుగుతున్న నీరు, గోరువెచ్చటి నీటిలో మారుస్తూ ఉండాలి.
- ఇలా మొత్తం 32 సార్లు గుడ్డును ఇలా ఉడికించాలని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- ఈ పద్ధతిలో ఉడికిస్తే గుడ్డులోని పోషకాలు, రుచి అనేవి నిక్షిప్తంగా ఉంటాయి.
- ఈ పద్ధతితో ఉడికించడం ద్వారా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు ఉండవు. ఇలా ఉడికించి తింటే ఎలాంటి వ్యాధులు రావని శాస్త్రవేత్తలు తమ పరిశోధనా పత్రాల్లో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter