T Congress: నేడు రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం భేటి.. అసంతృప్తి ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు..

T Congress: కులగణన విడుదల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నేతలు ఇదంత తప్పుల తడక సర్వే అంటూ సొంత పార్టీ పైనే విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్షం భేటి కానుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 6, 2025, 08:53 AM IST
T Congress: నేడు రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం భేటి.. అసంతృప్తి ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు..

T Congress:కాంగ్రెస్ శాసనసభాపక్షం మరికాసేట్లో సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై కూడా ఈ భేటిలో చర్చించనున్నారు. ముఖ్యంగా అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు వారితో ప్రత్యేకంగా భేటి కానున్నారు.

ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.  ఈ నేపథ్యంలో జరగబోతున్న శాసనసభా పక్ష సమావేశంపై అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లెజస్లేటివ్  భేటీలో తెలంగాణ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీ కూడా పాల్గొననున్నారు.

ఈ  భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్‌- ఈ 4 అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. రాజకీయాంశాలు కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రెండు మూడు జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. ఒకపక్క ఎస్సీ వర్గీకరణ అమలుకు సర్కారు శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మరోపక్క తాము కోరిన పనులు కాలేదంటూ కొందరు పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్‌ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

సీఎల్‌పీ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో పాటు, కేసీ వేణు గోపాల్ సహా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్టానానికి రేవంత్‌ వివరించనున్నారు. ఇక రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైనా సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News