Upasana Women Empowerment: రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 100 శాతం విజయవంతం సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వలన ఆంధ్రప్రదేశ్‌లో అతడి కుటుంబసభ్యులు పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌కు పరిమితమైన వారి కుటుంబసభ్యులు ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ నియోజకవర్గంలో తమ వంతు సహాయం అందించేందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కోడలు, రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తాత జన్మదినం సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతానని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Srikakulam YSRCP: వైఎస్ జగన్ పిలిచినా పలకని 'ఆ లీడర్లు వైసీపీలో ఉన్నట్టా.. లేనట్టా?'
అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా అతడి మనవరాలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఉపాసన తన చిన్న మామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సహాయ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉపాసన తన సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. మహిళా, శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పిఠాపురంలో ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఉపాసన వెల్లడించారు.
Also Read: YS Jagan: వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు భారీ షాక్.. 'ఆ కార్యక్రమం రద్దు'
'ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం. మహిళా సాధికారితలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహన కల్పిస్తాం' అని ఉపాసన వెల్లడించారు. వెయ్యి రోజులపాటు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభం మాత్రమేనని.. త్వరలోనే 109 అంగన్వాడీ కేంద్ర భవనాలను పునరుద్ధరిస్తామని ఉపాసన ప్రకటించారు. 'మీ అందరి ఆశీర్వాదంతో ఆరోగ్య, సాధికారిత తల్లులు, చిన్నారులను తయారుచేస్తాం' అని ఉపాసన పేర్కొన్నారు.
Thatha, every birthday of yours is special, but on this 93rd birthday, we are honored to celebrate by driving meaningful change to mothers —starting in Pitapuram.
Our Commitment to Transform Motherhood:
✅ Zero Maternal & Infant Mortality
✅ 1,000-Day Program – Prioritizing… pic.twitter.com/yQC7XwmTox— Upasana Konidela (@upasanakonidela) February 5, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.