Lady Professor Marries student in west bengal: వెస్ట్ బెంగాల్ లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. అప్లైడ్ సైకాలజీ హెచ్ఓడీ అయిన లేడీ ప్రొఫెసర్.. ఆ యూనివర్సీటీలోని ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ స్టూడెంట్‌ను క్లాసులోనే పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. సోషల్ మీడియాలో నెటిజన్లు లేడీ టీచర్ ను తెగ ట్రోల్ చేశారు. అంతే కాకుండా..ఇలాంటి పనిచేయడమేంటని కూడా తిట్టిపొశారు.
A lady Professor in MAKAUT is 'getting married' to her young student in the office. pic.twitter.com/coXaVGH7s7
— Abir Ghoshal (@abirghoshal) January 29, 2025
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని, యూనీ వర్సీటీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇది రచ్చగా మారడంతో.. స్టూడెంట్‌ను పెళ్లి చేసుకున్న లేడీ ప్రొఫెసర్‌ను అధికారులు సెలవుపై పంపించారు.
ఈ ఘటనలో సదరు లేడీ ప్రొఫెసర్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెప్పారు. తాజాగా.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. యూనీ వర్సీటీ అధికారులకు మెయిల్ సైతం పెట్టారు. ఈ వీడియోను నాడియా జిల్లాలోని హరిన్‌ఘాటా క్యాంపస్ తరగతి గదిలో చిత్రీకరించినట్లు వెల్లడించారు. అది కేవలం ఒక డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ లో భాగంగానే చేసినట్లు చెప్పుకొచ్చారు. స్టూడెంట్ లకు సైతం ఆ విషయం తెలుసన్నారు.
కొంతమంది కావాలని తనను వివాదంలోకి లాగారన్నారు. తన క్యారెక్టర్ ను కావాలని డీఫ్రెమ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఆ క్యాంపస్ లో పనిచేయలేనని, తన వీడియోను కావాలని లీక్ చేసిన వారిపై చట్టప్రకారం ముందుకు వెళ్తానని లేడీ ప్రొఫెసర్ హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter