Balakrishna: తమ్ముడిని ఆటపట్టిచ్చిన నందమూరి ఆడబిడ్డలు.. ముసి ముసి నవ్వుల నవ్విన బాలకృష్ణ భార్య..

Balakrishna Interview with Bhuvaneshwari: బాలయ్యకు పద్మభూషణ్ రావడంతో ఈవెంట్ నిర్వహించిన నందమూరి కుటుంబ సభ్యులు,  ఆ ఈవెంట్లో నందమూరి ఆడబిడ్డలు బాలకృష్ణను ఫన్నీగా ఒక ఆట ఆడుకున్నారు.. వాళ్లు ఎన్నో ప్రశ్నలు అడగగా.. దానికి బాలకృష్ణ సరదా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 5, 2025, 02:00 PM IST
Balakrishna: తమ్ముడిని ఆటపట్టిచ్చిన నందమూరి ఆడబిడ్డలు.. ముసి ముసి నవ్వుల నవ్విన బాలకృష్ణ భార్య..

Balakrishna Vasundhara : నందమూరి బాలకృష్ణ.. ఒకవైపు రాజకీయాలలో,  మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య.. ఇప్పటికే మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఈ ఏడాది బాలయ్య అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ఆనందాన్ని ఇచ్చింది. 

అదే కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం. ఈ విషయం అటు నందమూరి కుటుంబ సభ్యులకే కాకుండా అభిమానులకు కూడా ఆనందాన్ని కలిగించింది. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక ప్రత్యేకమైన పార్టీని కూడా చేసుకున్నారు.  ఇందులో కొంతమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. 

ముఖ్యంగా బాలయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యి బాలకృష్ణ కు సంబంధించిన ఎన్నో విషయాల పైన ఆయనని ప్రశ్నించడం జరిగింది ఫన్నీగా.. ముఖ్యంగా తన అన్నయ్యని ఆట పట్టిస్తూ నారా భువనేశ్వరి స్టేజ్ మీద ఒక ప్రశ్న అడిగింది. నువ్వు ఎవరికైనా లవ్ లెటర్ రాసావా? కనీసం వసు కైనా రాసావా?  అని బాలయ్యను అడగగా.. వసు కైతే రాశా.. అంటూ వసుంధర వైపు వేలు చూపించారు బాలయ్య.. ఈ విషయం పైన వసుంధరాని కూడా అడిగారు బాలయ్య. ఆరోజు తనకోసం ఒక జీన్స్ కూడా కొనింది అనే విషయాన్ని తెలిపారు. 

అయితే అది లెదర్ జాకెట్ అంటూ బాలయ్య చెల్లెలు నార భువనేశ్వరి తెలియజేశారు. దీంతో వసుంధర వైపు తిరిగి పురందేశ్వరి ఇలా అడుగుతూ.. ఆ లెటర్ పదిలంగా ఉందా?  అని అడగగా.. వసుంధర కూడా నవ్వుతూ ఉందంటూ తెలియజేసింది. మొత్తానికి బాలయ్య ఫంక్షన్ లోనే నందమూరి ఆడబిడ్డలు ఇలా ఆటపట్టిస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియోలను కూడా నందమూరి అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.

ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి సందడి చేశారు కానీ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లేకపోవడం ఒకింత బాధను కలిగించింది అంటూ అభిమానులు కామెంట్స్  చేస్తున్నారు.

Also Read: Zee Tv Sa Re Ga Ma Pa: ప్రతిష్టాత్మక వేదికలపై 'జీ సరిగమప' గాయనీలు అద్భుత ప్రదర్శన

Also Read: Rana Naidu 2 Teaser: 'రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే'.. వెంకీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News