Kumbh Mela stampede: 30 మంది చనిపోవడం పెద్ద విషయం కాదు.. తొక్కిసలాటపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ..

Hema malini on maha kumbh stampede: కుంభమేళలో మౌనీ అమావాస్య పుణ్య స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 4, 2025, 07:23 PM IST
  • వివాదాస్పదంగా మాట్లాడిన ఎంపీ హేమమాలీని..
  • కుంభమేళలో ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుందని కితాబు..
Kumbh Mela stampede: 30 మంది చనిపోవడం పెద్ద విషయం కాదు.. తొక్కిసలాటపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ..

Bjp mp hema malini controversy comments on Maha kumbh mela stampede: ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళ స్నానాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనికోసం మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.  జన్వరి 13న ప్రాంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26తో ముగియనుంది. అయితే.. గత నెల జన్వరి 29న కుంభమేళలో మౌనీ అమావాస్య రోజున తెల్లవారు జామున భక్తులు స్నానం చేసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అనుకొని ఘటనలో.. దాదాపు 30 మంది చనిపోగా, మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దీనిపై యోగి సర్కారు ఇప్పటికే జ్యూడీషియల్ కమిటీని నియమించింది. అంతే కాకుండా.. ఘటనకలో కుట్రకోణం ఉందని ఆరోపించింది. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటనపై సమాజ్ వాది పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ఏకీపారేస్తున్నాయి. ప్రభుత్వం కుంభమేళలో జరుగుతున్న అనేక అంశాలను అందరికి తెలిసేలా చెప్తున్నారన్నారు. అదే విధంగా ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్యను ఎందుకు బైటపెట్టడం లేదని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.

యోగి సర్కారు డెత్ ట్రోల్ ను దాచి పెడుతుందన్నారు. వెంటనే దీని వెనుకాల ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, కుంభమేళ బాధ్యతల్ని ఆర్మీకి అప్పగించాలన్నారు. ఎంపీ జయాబచ్చన్ సైతం కుంభమేళ త్రివేణి సంగమం పూర్తిగా కాలుష్య కూపంగా మారిపోయిందన్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు నదిలో శవాలను విసిరేశారని ఆరొపణలు గుప్పించారు.

Read more: Maha Kumbh 2025: కుంభమేళలో భూటాన్ రాజు.. యోగితో కలిసి గంగా హరతి, పవిత్ర స్నానం.. పిక్స్ వైరల్..

ఈ క్రమంలో దీనిపై తాజాగా.. బీజేపీ ఎంపీ హేమ మాలీని కౌంటర్ ఇచ్చారు. కుంభమేళ కోసం ప్రభుత్వం ఎంతో కష్టపడుతుందని అన్నారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమంటూనే.. 30 మంది తొక్కిసలాట చనిపోవడం పెద్ద విషయం కాదన్నారు.

భక్తులు ప్రపంచ వ్యాప్తంగా కుంభమేళలో స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారని.. యోగి సర్కారు భక్తుల కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు.  అదే విధంగా సమాజ్ వాది పార్టీ నేతలు.. తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకొవాలని ఎంపీ హేమమాలీని కౌంటర్ ఇచ్చారు. అయితే.. హేమమాలీని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంట్రవర్సీగా మారాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News