Caste Census: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన సర్వేపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశం ఏర్పాటుచేసి చెప్పింది ఏమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. కుటుంబ సర్వే, కులగణనపైన శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మంత్రివర్గ సమావేశం నిర్వహించడంతో చారిత్రాత్మక ప్రకటన ఉంటుందనుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తారని రాష్ట్రంలోని బీసీ బిడ్డలు ఎదురుచూశారు' అని కేటీఆర్ తెలిపారు.
Also Read: Harish Rao: రియల్టర్‌ది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి చేసిన హత్య
గతంలో మా ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలుసు. తెలివి ఉన్న వాళ్లు ఎవరైనా సర్వేలో పాల్గొంటారా? అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేను చేసింది కూడా ప్రభుత్వమే చేసింది. అప్పుడు చేసింది కూడా ప్రభుత్వమే సాధికారికంగా చేసింది' అని కేటీఆర్ గుర్తుచేశారు. సమగ్ర కుటుంబ సర్వే అధికారికంగా వెబ్సైట్లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఆరోజు ఒక్కరోజులోనే ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు తీసుకున్నామని చెప్పారు. 3.68 కోట్ల మంది ఈ సర్వేలో పాల్గొన్నారని తెలిపారు.
'సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 51 శాతం హిందూ బీసీలు ఉంటే 10 శాతం ముస్లిం బీసీలు కలిపితే 61 శాతం ఉండేవారు. రాష్ట్రంలో ఉన్న 51 శాతం మంది బీసీలు 47 శాతానికి ఎట్లా తగ్గిందని ప్రతి ఒక్క బీసీ బిడ్డలు అడుగుతున్నారు' మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'సమగ్ర సర్వేలో ఆనాడు ఉన్న 1,85,61,000 మంది ఉంటే నేడు ఎట్లా 21 లక్షలు తగ్గి నేడు కోటి 64 లక్షలకు ఎట్లా తగ్గింది' అని ప్రశ్నించారు. పదేండ్ల తర్వాత బీసీ జనాభా ఎలా తగ్గిందని నిలదీశారు. ఇదే మాటను మేం కూడా అసెంబ్లీలో అడుగుతున్నామని స్పష్టం చేశారు.
'కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ సర్వేను తగలబెట్టమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నాయకులు అంటున్నారు. ఈ రోజు ప్రభుత్వం సభలో పెట్టిన సమాచారంలో కొత్త ఏం లేదు? మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇదే మాట మొన్న ప్రెస్మీట్లో చెప్పారు. ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం కొత్తగా చెప్పింది ఏమిటి'? అని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. '42 శాతం బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు తెస్తారనుకున్నాం. 61 శాతం బీసీలు ఉన్న జనాభాకి బీసీ సప్లై తెస్తారని భావించాం. ఇవేవీ కాకుండా మొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పిన సమాచారాన్ని అసెంబ్లీలో పెట్టారు. అంతకుమించి ఏం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.