Telangana Assembly: త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముందు ఈ రోజు తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సెసన్ లో బీసీ కులగణన నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ను ప్రభుత్వం సభలో చర్చించనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలనుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన నివేదికను అసెంబ్లీ ముందుంచనుంది. అంతేకాదు దానిపై చర్చించి ఆమోదించనుంది. దానిని తీర్మానం రూపంలో కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ఇక పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్నాయి . ఆ తర్వాత మళ్లీ మార్చి లో రెండో విడత సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశానికి గంట ముందు రేవంత్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఆమోదించనుంది.
కులగణన లెక్కను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇదే టైంలో రైతు భరోసా, రేషన్ కార్డులు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ను నిలదీసేందుకు రెడీ అయ్యాయి విపక్షాలు. జనవరి 26న రైతు భరోసా,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇస్తామని ప్రకటించింది రేవంత్ సర్కార్.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఆ రోజు కేవలం శాంపిల్ గా మండలంలో ఓ గ్రామానికి డబ్బులు వేసిన సర్కార్. ఆ తర్వాత ఎవరికి ఇవ్వలేదు. దీనికి తోడు రేషన్ లిస్ట్ కూడా అలానే ప్రకటించిన సర్కార్... ఎవరికి వచ్చిందనేదానిపై క్లారిటీ లేదు. దీంతో ఇదే విషయంలో అసెంబ్లీలో సర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. దీనికి తోడు లోకల్ బాడీ ఎన్నికలపై కూడా రచ్చ జరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.