Manchu Family Property Dispute: మంచు మోహన్ బాబు కుటుంబం గొడవలు మరోసారి వార్తలలో నిలిచాయి. మోహన్ బాబు, మనోజ్ లు ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వారి ఎదుట హజరయ్యారు. అయితే.. గతంలోనే మంచు మోహన్ బాబు తన కొడుకుపై రంగారెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మనోజ్ అక్రమంగా జల్ పల్లిలోని తన నివాసంలో ఉంటున్నాడని, ఇది తన స్వార్జీతమని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎదుట మోహన్ బాబు, మనోజ్ లు విచారణకు హజరవ్వడం ఆసక్తికరంగా మారింది.
మోహన్ బాబు గతంలో.. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం- 2007 కింద తనకు రక్షణ కల్పించాలంటూ తన ప్రతినిధితో కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి లేఖను పంపించారు. బాలాపూర్ మండలం జల్పల్లి ఉన్న తన స్వఆస్తిపై ఎవరికి హక్కు లేదన్న మోహన్ బాబు.. తన ఆస్తులు తనకు అప్పగించేలా చర్యలు తీసుకొవాలన్నారు.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు.. సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్‌కు వారం క్రితం ట్రైబ్యునల్ కార్యాలయం ద్వారా మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు పంపించారు. దీనిలో భాగంగా.. మనోజ్ జనవరి 19న కూడా కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌కు వచ్చి, అడిషినల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మరల ఈ రోజు కూడా మంచు మోహన్ బాబు, మనోజ్ లకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
Read more: Allu Arjun: తండేల్ ఈవెంట్‌కు డుమ్మాకొట్టిన బన్నీ.. షాకింగ్ నిజం బైటపెట్టిన అల్లు అరవింద్..
ఈరోజు ఇద్దరు రంగారెడ్డి కలెక్టర్ ఎదుట హజరయ్యారు. మోహన్ బాబు కలెక్టర్ ఎదుట మరోసారి ఎమోషనల్ కు గురయ్యారు. అయితే.. ఇద్దరు కూడా కొన్ని డాక్యుమెంట్ లను తీసుకుని కలెక్టర్ ఎదుట హజరయ్యారు. వారికి సంబంధించిన వాదోపవాదాలు కలెక్టర్ కు విన్పించారు. వారికి సంబంధించిన వాదోపవాదాలు కలెక్టర్ కు విన్పించారు. అయితే.. విచారణ సమయంలో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం దూషణలు చేసుకున్నారు.
ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ఆస్తికి సంబంధించిన విచారణ అధికారిణి ప్రతిమ సింగ్ కు పూర్తి వివరాలు అందజేశారు. సుమారు రెండు గంటల పాటు వీరి మధ్య విచారణ సాగింది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ వచ్చే వారం మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట విచారణ హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడకుండానే.. మంచు మనోజ్ ఆవేశంలో వెళ్లిపోయారు.
అయితే.. తమ మధ్య ఉన్నవి ఆస్తిగొడవలు కాదని, విద్యార్థుల కోసం తాను మాట్లాడుతున్నానని.. మంచు విష్ణు తన తండ్రిని అడ్డం పెట్టుకుని ఇదంతా చేయిస్తున్నాడని మంచు మనోజ్ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వీరి కుటుంబ వ్యవహారంలో గొడవలు మరల ఏవిధమైన మలుపు తిరుగుతుందో అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter