AP Registration Charges: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. కొత్త రిజిస్ట్రేషన్ విలువలు శనివారం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విలువలు తగ్గించగా.. మరికొన్నిచోట్ల భారీగా పెంచారు. కొన్నిచోట్ల యథాస్థితి కొనసాగించారు. సగటున 20% విలువలు పెరిగాయి.
గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ రూ. 1.96 కోట్లు ఉండగా, దాన్నిరూ. 30 లక్షలు చేశారు. విజయవాడలో 3% నుంచి 9% వరకు ఆస్తుల విలువలు పెరిగాయి. విశాఖలోనూ పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లి పట్టణంలో యథాతథంగా ఉంచి, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాది లోపే రిజిస్ట్రేషన్ ఛార్జీలు సహా పలు సేవలపై రుసుములు పెంచడంపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. త్వరలోనే భారీగా కరెంట్ ఛార్జీలతో పాటు నీటి ఛార్జీలు పెంచే యోచనలో కూటమి సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా యేడాదికి మూడు ఉచిత సిలిండర్లు సహా పెద్దగా ఏవి ఇవ్వలేదు. మహిళలకు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఆ పై యేడాది తల్లికి వందనం సహా మొత్తంగా సూపర్ సిక్స్ పథకాలను ఆరు నెలలకు ఒకటి చొప్పున మూడేళ్లలో అమలు చేయాలనే యోచనలో ఉన్నారు. అప్పట్లో జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలను ఇచ్చిన ప్రజలకు కూటమి ప్రభుత్వాన్ని అధికారం అప్పగించారు. ఈ నేపథ్యంలో లేటుగా ఒక్కొక్క సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.