Harsha Richhariya: కుంభమేళలో సందడి చేస్తున్న గ్లామరస్ సాధ్వీ.. హర్ష రిచారియా ఎవరో తెలుసా..?

Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళలో ప్రస్తుతం సాధ్వీ హర్ష రిచారియా చర్చనీయాంశంగా మారారు.
 

1 /8

కుంభమేళ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. దేశ, విదేశాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటికే పుష్య పౌర్ణమి నేపథ్యంలొ మొదటి షాహీ స్నానం ముగిసింది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.  

2 /8

ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళలో ముఖ్యంగా నాలుగు ముఖ్యమైన రోజులుగా చెప్తుంటారు. దాదాపు.. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళ ఉత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు.  యోగి సర్కారు భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేపట్టింది.  

3 /8

జన్వరీ 14 మకర సంక్రాంతి, 29 మౌనీ అమావాస్య,  ఫిబ్రవరి 3 వసంత పంచమి, 12 మౌనీ అమావాస్య, 26 మహా శివరాత్రి నేపథ్యంలో షాహీ స్నానాలుగా చెప్తుంటారు. దాదాపు.. 14 అఖాడాలకు చెందిన సాధులు, అఘోరీలు, నాగ సాధులు ఈ కుంభమేళకు వచ్చి పవిత్ర స్నానాలను ఆచరిస్తుంటారు.  

4 /8

 ప్రస్తుతం కుంభమేళలో కొంత మంది బాబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ సతీమణి.. లారెన్స్ పావెల్ కూడా కుంభమేళకు హజరయ్యారు. అంతేకాకుండా.. ఆమె ఇటీవల అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే.

5 /8

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కుంభమేళలో.. హర్ష రిచారియా గ్లామరస్ సాధ్వి ప్రస్తుతం వార్తలలో నిలిచారు. ఆమె ఇటీవల.. నిరంజని అఖాడా  నాయకుడు ఆచార్య మహామండలేశ్వర్ స్వామి శ్రీ కైలాష్‌నందగిరి జీ మహారాజ్ అనుచరురాలిగా మారానని.. ఉత్తరాఖండ్ తన స్వస్థలమని, మౌరాణి పూర్ లో పుట్టానని హర్ష రిచారియా చెబుతున్నారు. 

6 /8

అయితే.. హర్షరిచారియాకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ అని.. ఆమెకు ఇన్ స్టాలో పాటు.. అనేక సోషల్ మీడియాల్లో భారీగా ఫాలో వర్స్ ఉన్నారని తెలుస్తొంది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొంత మంది ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.

7 /8

కుంభమేళను ఉపయోగించుకుని మరింతగా పాపులారీటీ పెంచుకునేందుకు.. ఈ విధంగా రుద్రాకలు, బొట్టులు ధరించి హల్ చల్ చేస్తుందని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుతుంది. కానీ ఆమె ఇన్ స్టాలో చూస్తే మాత్రం గతంలో కూడా హిందు ధర్మం కోసం పోరాడుతూ.. అనేక వీడియోలను రిలీజ్ చేశారు.  

8 /8

మన ధర్మంను మనమే కాపాడుకోవాలని.. ఒక వేళ మీకు ఆ ధైర్యం లేకుంటే.. పొరాడే వాళ్లకు అండగా ఉండాలని కూడా సాధ్వీగా మారిన హర్షరిచారియా గతంలో మాట్లాడారు. అయితే.. ప్రస్తుతం హర్ష రిచారియా మాత్రం కుంభమేళలో గ్లామరస్ సాధ్వీగా ప్రత్యేక ఆకర్శణలాగా మారారు. ఆమె గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారంట.