Janhvi Kapoor:జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా..!

Janhvi Kapoor: జాన్వి కపూర్ ప్రస్తుతం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా వరస సినిమాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ మధ్య నేను తీవ్ర సినిమాతో సక్సెస్ సాధించిన ఈ హీరోయిన్ త్వరలోనే రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా హీరోయిన్గా కనిపించనుంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే సినిమాలో జోరు కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె పెళ్ళికి సైతం సిద్ధమైపోయిందట. 

1 /5

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందచందాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది.  అక్కడ వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న.. జాన్వీ సోషల్ మీడియా ద్వారా నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తే యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది.

2 /5

 జాన్వీ కపూర్ ఇటీవల తెలుగులో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలోనే ఈమెకు పలు సినిమాలలో అవకాశాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే.. రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాతో పాటు మరో సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. 

3 /5

ఇక జాన్వీ కపూర్ వ్యక్తిగత విషయానికి వస్తే.. శ్రీకర్ పహారియాతో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరలోనే జాన్వీకపూర్ కు ఇతడితో పెళ్లి చేయాలని, ఈమె తండ్రి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కూడా ఆలోచిస్తున్నారట.  

4 /5

మరి అందులో భాగంగానే ఆగస్టు నెలలో నిశ్చితార్థం చేసి డిసెంబర్ నెలలో వివాహం జరిపించాలని పడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారడంతో జాన్వీ కపూర్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. 

5 /5

ఇక జాన్వి కపూర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలతో పాటు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.  అందులో భాగంగానే ఇలా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుందని చెప్పవచ్చు.ఇప్పుడు  వివాహానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఇక ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.