Leopard attacks on ttd employee at alipiri : ఆధ్యాత్మిక నగరమైన తిరుమలలో.. చిరుతలు ఇటీవల రాత్రి పూట ఎక్కువగా సంచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాత్రిపూట, అలిపిరి మెట్ల మార్గం దగ్గర అనేక సందర్భాలలో చిరుతపులులు వచ్చిన ఘటనలు వార్తలలో నిలిచాయి. చాలా సార్లు మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్న భక్తులపై దాడులు కూడా చేశాయి. దీంతో గత సర్కారు చేతిలో కర్రను ఇచ్చి.. మెట్ల మార్గం గుండా వెళ్లాలని కూడా స్పష్టం చేసింది.
అంతే కాకుండా.. శ్రీవారి దర్శనానికి గుంపులుగా, గుంపులుగా వెళ్లాలని కూడా చెప్పింది. అయితే.. ఇటీవల తిరుమలలో రాత్రి సందర్భాలలో చిరుతలు, ఎలుగు బంట్లు, పాములు ఎక్కువగా మెట్లకు సమీపంలో వచ్చిన ఘటనలు అనేక ప్రాంతాలో అమర్చిన సీసీ టీడీ ఫుటేజ్ లలో రికార్డు అయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక చిరుత రాత్రి పూట.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగిపై దాడి చేసింది.
తిరుమలలో జూపార్క్ రోడ్ లో చిరుత హల్ చల్ చేసింది. సైన్స్ సెంటర్ దగ్గర వ్యక్తిని రాత్రిపూట చిరుత దాడిచేసింది. దీంతో అతను చిరుత బారినుంచి తప్పించుకుని వెళ్లి దూరంగా వెళ్లిపోయాడు.
వెంటనే సమీపంలోని సిబ్బందిని అలర్ట్ చేయడంతో.. గట్టిగా కేకలు వేయడంతో చిరుత పొదల్లోకి వెళ్లిపోయినట్లు అక్కడి వారు చెప్పారు. అయితే.. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని.. టీటీడీ ఉద్యోగి మునికుమార్ గా అని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మునికుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతను బైక్ పై వెళ్తుండగా చిరుత దాడి చేసినట్లు బాధితుడు టీటీడీ ఉద్యోగులతో చెప్పాడు. ఈ క్రమంలో మళ్లీ తిరుమలలో చిరుత హల్ చల్ ఘటన వార్తలలో నిలిచింది. మెట్ల మార్గంలో వెళ్లే వారు గుంపులుగా వెళ్లాలని.. టీటీడీ అధికారులు భక్తులకు పలు సూచనలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter