NBK Recent Movies Pre Release Business: నందమూరి బాలకృష్ణ తన సినిమాల విషయంలో దూకుడు మీదున్నారు. సినిమాకు సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నారు. తాజాగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
అఖండ నుంచి బాలయ్య సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకులు కొత్త బాలయ్యను చూస్తున్నారు. ఆ సినిమా నుంచి అపజయం అంటూ లేకుండా తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. మరి ‘డాకు మహారాజ్’ మూవీతో ఆ జైత్ర యాత్ర కంటిన్యూ అవుతుందా లేదా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అంతేకాదు ఆయన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది.
డాకు మహారాజ్ - బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాలయ్య కెరీర్ లో హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
భగవంత్ కేసరి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తన ఏజ్ కు తగ్గ పాత్రలో నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
వీరసింహారెడ్డి - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
అఖండ.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’. బాలయ్య ఈ సినిమాలో రైతుగా.. అఘోరాగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.