Tirupati stampede: నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. మరి అసలు ఇంతటి తప్పిదం జరగడానికి కారణం ఏమిటి అని ఆరా తీస్తున్నారు అందరూ. అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం..
తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగి.. 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. వైకుంఠ ఏకాదశి పటిష్టమైన చర్యలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సేవలు అందిస్తోందని.. నిన్న ఉదయమే భక్తుల ప్రశంసల వెల్లువ కురిపించారు.
ఉదయం అలా అంతా సవ్యంగా సాగింది.. కానీ సాయంత్రం అయ్యేసరికి అనుకోని సంఘటన జరిగింది. టికెట్ల జారీ దగ్గర తోపులాట, తొక్కిసలాట జరిగి ఏకంగా 6 మంది మృతి చెందారు. మరింత మందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే దీనంతటికీ ఒక సంఘటనే.. కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా ఒక చిన్న తప్పు వల్ల ఇదంతా జరిగింది అని.. చెబుతున్నారు. ఇక ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది.. అంటూ..అటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో పాటు పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.
ఇకపోతే టికెట్ లు జారీ చేసే క్యూ లైన్ దగ్గర అనారోగ్యంతో ఆయాస పడుతున్న వృద్ధురాలిని గుర్తించి, గుంపు నుండి తప్పించి గేటు లోపలికి తీసుకొచ్చేందుకు టీటీడీ సిబ్బంది ఎంతో ప్రయత్నించారు. దీనికి వృద్ధురాలి వెనకున్న భక్తులు కూడా సహకరించారు. ఆమె ఒక్కదానిని లోపలికి తీసుకొని వెళ్తుండగా.. ఇంతలోనే కొద్ది దూరంలో కేకలు అరుపులతో పెద్ద దుమారం లేచింది. అసలు విషయానికి వస్తే డిఎస్పి తలుపు తీయగా.. అక్కడున్న వారంతా టికెట్లు ఓపెన్ అయ్యాయని ఒక్కసారిగా టికెట్స్ కోసం వెళ్లడానికి ప్రయత్నించారు.
ఇక జనాలంతా ఒక్కసారిగా రావడంతో.. తోపులాటగా మారింది. ముఖ్యంగా మొదటి వరుసలో ఉన్న భక్తులు, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కావాలనే వెనకాల నుండి ముందుకు తోసారని అందుకే తొక్కిసలాట జరిగిందని, ఆ తొక్కిసలాటలో ఏకంగా ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. నివేదిక ఇచ్చారు. డీఎస్పీ అత్యుత్సాహంతో ఒక్కసారిగా తలుపు తీయడంతో ఇలా జరిగిందని.. ఆ తరువాత డిఎస్పి స్పందించలేదని.. కానీ ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్టు నివేదికలో వెల్లడించారు. అంతేకాదు డిఎస్పీ కథన జరిగిన 20 నిమిషాల పాటు అందుబాటులో లేరని కూడా తెలిపారు.
ఇక ఉదయం సరైన క్యూ లైన్లు పాటించిన టీటీడీ సాయంత్రానికి ఎందుకు నిర్లక్ష్యం చేసిందని మరికొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.