Gold Rate Today: సంక్రాంతి పండగ ముందు భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎంత తగ్గిందంటే?

Gold Rate Today: కొత్త ఏడాదిలో పసిడి  ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు జనవరి 6వ తేదీ సోమవారం బంగారం ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి పండగ ముందు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. నేడు బంగారం,వెండి ధరలు ఏ మేరకు తగ్గాయో చూద్దాం. 
 

1 /6

Gold Rate Today: కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని చాలా మంది అంచనా వేశారు. కానీ ఏడాది ప్రారంభంలో వరుసగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గాయి. ఇలా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.   

2 /6

అయితే మూడు రోజులు బంగారం ధరలు భారీగా పెరగడంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో పడ్డారు. అయితే నేడు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 

3 /6

2025 ప్రారంభంలోనే భారీగా పెరిగిన బంగారం ధర జనవరి 1న, 2వ తేదీన పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. జనవరి 5వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర రూ. 77,150గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,710గా నమోదు అయ్యింది. 

4 /6

అయితే నేడు జనవరి 6వ తేదీ సోమవారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,170పలుకుతోంది.   

5 /6

అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72150 ఉంది. ఆదివారం ధర కంటే నేటి ధర ఒకే విధంగా ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

6 /6

ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవాళ్లు కొన్నిరోజులు ఓపిక పట్టడం మంచిదేమో అంటున్నారు మార్కెట్ నిపుణులు.