Sobhita Dhulipala Dance: అరే వా.. సూపర్.. పెళ్లిలో కిర్రాక్ స్టెప్పులు వేసిన శోభిత ధూళిపాళ.. వీడియో ఇదిగో..

Sobhita and Nagachaitanya: శోభిత ధూళిపాళ, నాగచైతన్య వెడ్డింగ్ ఇటీవల గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త జంట శ్రీ శైలం వెళ్లి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 10, 2024, 07:59 PM IST
  • మేకప్ రూమ్ లో మాస్ స్టెప్పులు వేసిన శోభిత..
  • ఫిదా అవుతున్న అక్కినేని అభిమానులు..
Sobhita Dhulipala Dance: అరే వా.. సూపర్.. పెళ్లిలో కిర్రాక్ స్టెప్పులు వేసిన శోభిత ధూళిపాళ.. వీడియో ఇదిగో..

Sobhita Dhulipala dance in wedding video viral: శోభిత ధూళిపాళ, నాగచైతన్యల పెళ్లి డిసెంబరు 4న అన్న పూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది. రాత్రి 8. 13 నిమిషాలకు పెళ్లి వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి పెళ్లి గురించి ప్రతిరోజు అనేక వార్తలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అయితే.. ఈ జంట పెళ్లికి సంబంధించిన అనేక పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

అదే విధంగా కొత్త జంట మాత్రం ఇటీవల శ్రీ శైలం వెళ్లి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అయితే.. నాగార్జున కుటుంబానికి శ్రీ శైలం ఆలయ సిబ్బంది, స్వాగతం పలికి.. స్వామివారి దర్శనం చేయించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా స్వామి వారితీర్థప్రసాదాలు, ఆశీర్వాచరం అందించారు. అయితే... ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా శోభిత పెళ్లి గురించి వార్తలు చర్చనీయాంశంగా ఉంటున్నాయి.

 

శోభిత పెళ్లి తర్వాత తన భర్తను ఆకాశానికి ఎత్తేసినట్లు తెలుస్తొంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. తన భర్త ఎంతో సింపుల్ గా ఉంటారని, అందరితో ఈజీగ కలిసిపోతారని, పెద్దలంటే రెస్పెక్ట్ ఇస్తారని కూడా చెప్పుకొచ్చింది. అయితే.. ప్రస్తుతం శోభిత డ్యాన్స్ చేసిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. 

శోభిత పెళ్లి రోజు మెకప్ గదిలో అందంగా రెడీ అవుతుంది. అప్పుడు.. అక్కడ మాస్ స్టెప్పులు వేస్తు అక్కడున్న వారిని ఫిదా చేసింది. తాజాగా.. శోభిత మేకప్ రూమ్ లో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారంట. అక్కినేని కోడలు భలే డ్యాన్స్ లు చేస్తుందని అనుకుంటున్నారంట. మొత్తానికి అక్కినేని కోడలు మాత్రం పెళ్లిని ఫుల్ ఎంజాయ్ చేసిందని తెలుస్తొంది.

Read more: Shilpa Shetty: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ.. అబ్బాయిలకు చెమటలు పట్టిస్తున్న సాగర కన్య... హాట్ పిక్స్ వైరల్..

పెళ్లిలో కూడా.. అనేక సందర్భాలలో శోభిత చాలా ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. తాళిబొట్టు కట్టేటప్పుడు కూడా శోభితా ఒక్కసారిగా చైతు వంక చూస్తు ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడు.. శోభిత డ్యాన్స్ చేసిన వీడియో మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News