Devara: దేవరతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ఎన్టీఆర్..

Devara: ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ల ల్యాంగ్ తర్వాత సోలో హీరోగా యాక్ట్ చేసిన చిత్రం  ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ నందమూరి, మిక్కిలినేని సుధాకర్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే తెలుగులో రాష్ట్రాలు సహా అన్ని ఏరియాల్లో ‘దేవర’ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం తాజాగా తెలుగు రాష్ట్రాల్లోసరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

1 /7

ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర పార్ట్ -1’.  మిక్స్ డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ను కుమ్మేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో హిందీ మినహా మిగతా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

2 /7

‘దేవర’ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హిందీలో స్ట్రీమింగ్ అయితే.. అది కూడా ఓ రేంజ్ లో ఇరగదీయడం పక్కా అని చెప్పొచ్చు.

3 /7

ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత  ‘దేవర’తో అదే రేంజ్ సక్సెస్ అందుకోక పోయినా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో కుమ్మేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. రూ. 500 కోట్ల కోట్ల క్లబ్బులో ఎంట్రీ ఇచ్చింది.

4 /7

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో దీపావళి సినిమాల తర్వాత ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 114 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.

5 /7

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 180 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా చేసిన బిజినెస్ కంటే రూ. 65 కోట్ల వరకు లాభాలను అందుకుంది.

6 /7

అంతేకాదు ఈ మధ్యకాలంలో ఏ బడా హీరో సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు. కానీ ‘దేవర’ సినిమా మాత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని అసలు సిసలు హిట్ గా నిలిచింది. ఓ రకంగా చెప్పాలంటే ఇది అసలు సిసలు బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7 /7

ఎన్టీఆర్ విషయానికొస్తే.. దేవర తర్వాత ‘దేవర పార్ట్ 2’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీలు లైన్ లో ఉన్నాయి.