Iqoo 13 Price: ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌.. 50MP ప్రధాన కెమెరాతో iQOO 13 మొబైల్‌ విడుదల..

Iqoo 13 Price: iQOO నుంచి మార్కెట్‌లోకి అద్భతమైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Iqoo 13 Price: వీవో సబ్‌బ్రాండ్‌ iQOO నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది శక్తివంతమైన ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ iQOO 13 పేరుతో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. మొదట దీనిని చైనాలో లాంచ్‌ చేయబోతోంది. దీనిని కంపెనీ డిసెంబర్ 3వ తేదిన భారత్‌లో కూడా లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 

1 /6

ప్రస్తుతం మార్కెట్‌లో Realme GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌  స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC సపోర్ట్‌తో అందుబాటులోకి వస్తోంది. ఈ చిప్‌సెటప్‌తో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ కాగా iQOO 13 మొబైల్‌ రెండవది కాబోతోంది.   

2 /6

త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోయే iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది  ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 50MP టెలిఫోటో లెన్స్  సపోర్ట్‌తో వస్తోంది. ఇక వీటికి తోడుగా 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది.  

3 /6

ఇక ఈ iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ వివరాల్లోకి వెళితే.. భారత్‌లో లాంచ్‌ అయితే దీని ధర దాదాపు రూ.52,999తో విడుదల కానుంది. అంతేకాకుండా విడుదలైన సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.  

4 /6

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి కెమెరా వివరాల్లోకి వెళితే..ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత శక్తివంతమైన 6.82-అంగుళాల OLED డిస్‌ప్లేని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది LTPO OLED డిస్‌ప్లే సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.  

5 /6

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్ల్పే 144Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా పవర్‌ఫుల్ Qualcommకి సంబంధించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోతోంది. దీంతో పాటు ఇది 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌తో విడుదల కానుంది.  

6 /6

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన  6,150mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే  ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.