Benefits Of Amla Candy: ఉసిరి క్యాండీ అంటే ఉసిరికాయలను చక్కెరతో కలిపి తయారు చేసిన ఒక రకమైన క్యాండీ. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జుట్టుకు మంచిది, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖ్యంగా బయట పిల్లలు తినే క్యాండీల కంటే ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. దీని ఇంట్లోనే తయారు చేయడం ఎంతో సులభం.
చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను ఒప్పించి చాకెట్లు కొనాలని అడుగుతూ ఉంటారు. చాకెట్లలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. ఎక్కువగా తింటే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. దంతాలు క్షీణించే ప్రమాదం ఉంది. అలాగే, చాకెట్లు తినడం వల్ల బరువు పెరుగుతారు.
కానీ ఈసారి బయట లభించే చాకెట్లు కాకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన క్యాండీని తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం కూడా. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి.
ఉసిరికాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
ఉసిరి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది, జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. ఈ చాకెట్లను పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా తినవచ్చు.
కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - 1 కిలో, నల్ల ఉప్పు- సగం టీస్పూన్ , జీలకర్ర- 1.5 స్పూన్ , పొడి చక్కెర-1.5 స్పూన్ , చక్కెర-1.5 కిలోల, చాట్ మసాలా - 1.5 స్పూన్
తయారీ విధానం: ఉసిరికాయలను బాగా కడిగి, నీటిలో నానబెట్టి, తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి, విత్తులను తీసివేయాలి.
కోసిన ఉసిరి ముక్కలను మిక్సీ జార్ లో వేసి, నీరు కలిపి మెత్తగా మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన ఉసిరి పేస్ట్ ను ఒక పాత్రలోకి తీసి ఇందులో చక్కెర కలిపి ఇతర పదార్థాలు వేసి మరగబెట్టాలి.
ఉసిరి పేస్ట్ మరగడం మొదలైన తర్వాత ఉసిరి పేస్ట్ పాకం పట్టే వరకు ఉడికించాలి. పాకం పట్టిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పాకాన్ని ఒక చల్లటి పాత్రలో వేసి చూడాలి. అది గట్టిపడితే పాకం పట్టిందని అర్థం.
పాకం పట్టిన ఉసిరి పేస్ట్ ను ఒక బాణలిలో వేసి తక్కువ మంట మీద నీరు ఆవిరి అయ్యే వరకు వేయించాలి. ఉసిరి పేస్ట్ చల్లారిన తర్వాత దానిని చిన్న చిన్న పాత్రల్లో నింపి, మూతలు వేసి, చల్లటి ప్రదేశంలో నిల్వ చేయాలి.