Pawan Kalyan silence : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏపీలో మరోసారి ఆసక్తికర చర్చ జరగుతుంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పూర్తిగా సైలెంట్ గా మారారు. రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణమాలు జరుగుతున్నా జనసేనాని మాత్రం కనీసం నోరు తెరవడం లేదని సొంత పార్టీలోనే తీవ్ర చర్చ జరుగుతుంది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ లో చాలా మార్పు వచ్చిందని జనసేన క్యాడర్ లోనే చర్చ జరుగుతుంది.పవన్ కళ్యాణ్ చాలా ఆచితూచి ప్రతి విషయంపై స్పందిస్తున్నారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. గతంలో ఒక రాజకీయ పార్టీగా అధికార పార్టీనీ నిలదీయడానికి అనేక ప్రజలకు సంబంధించిన విషయాలపై ఘాటుగా స్పందించాల్సి వచ్చిందని ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండడంతో కాస్తా దూకుడును తగ్గించినట్లు పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఐతే కొద్ది రోజులు క్రితం తిరుమల లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ తీరు చాలా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి దేశ వ్యాప్తంగా ఒక పెద్ద సెన్షేషన్ క్రియేట్ చేశారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఎరుపు రంగు దుస్తులు ధరించి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతే కాదు దీక్ష చివరి రోజున కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఆ సమయంలో ఏపీతో పాటు నేషనల్ మీడియా సైతం పవన్ ను పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. అదే క్రమంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల తిరుపతిలో వారాహి సభ పెట్టి సనాతన ధర్మం గురించ పెద్ద సంచలన కామెంట్స్ చేశారు. సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దాని కోసం యువత కదిలి రావాలంటూ పిలుపునిచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో రాజకీయంగా పెను దుమారం రేగింది. కొందరు పవన్ వ్యాఖ్యలను సమర్ధించగా మరి కొందరు మాత్రం పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
ఇలా కొద్ది రోజులు పవన్ సనాతన ధర్మం చుట్టే ఏపీ రాజకీయాలు నడిచాయి. ఆ తర్వాత తిరిగి పవన కళ్యాణ్ పెద్దగా ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు. అంతక ముందు కూడా పవన్ కళ్యాణ్ తీరుపై కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది. విజయవాడ వరదల సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటఊ చర్చ జరిగింది. అంతే కాదు ఏపీ డిప్యూటీ సీఎం అయి ఉండి తన పుట్టిన రోజులు జరుపుకున్నాడు తప్పా వరద బాధితులను పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ తర్వాత పవన్ వెంటనే రంగంలోకి వరద బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉండిపోయిన పవన్ మళ్లీ తిరుమల లడ్డు కల్తీ విషయం తెరమీదకు రావడంతో మరోసారి పవన్ సంచలనంగా మారారు.
తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి సైలెంట్ మారారు. ఈ సైలెంట్ వెనుక కారణాలు మాత్రం తెలియరావడం లేదు. ఒక వైపు ఏపీలో జగన్-షర్మిల ఆస్తుల వివాదం జరగుతుంది. మరోవైపు అనేక అంశాలపై ప్రతిపక్షం ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. ఐనా పవన్ మాత్రం పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విశాఖ పట్టణం వెళ్లిన పవన్ కళ్యాణ్ రుషి కొండ ప్యాలెస్ కు వెళ్లారు. రుషి కొండ ప్యాలెస్ పై పవన్ ఏదైనా కీలక ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు కానీ పవన్ మాత్రం చాలా కూల్ గా ఉండిపోయారు. ఇలా పవన్ ఎందుకు కామ్ గా ఉంటున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో పవన్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం పవన్ కొత్తగా మౌన దీక్ష ఏమైనా చేపట్టి ఉండొచ్చు అని వెటకారంగా అంటున్నారట.
మరోవైపు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలను ,అటు రాజకీయాల్లో బిజీబిజీగా మారారని జైసైనికులు చెబుతున్నారు. ఒక వైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్విర్తిస్తూనే మరోవైపు సినిమా షూటింగ్ లకు సమయాన్ని కేటాయిస్తున్నారని జన సేన చెబుతుంది. అంతే కాదు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడితేనే రాజకీయాల్లో విలువ ఉంటుందని ,ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టాను సారంగా మాట్లాడితే విలువ ఉండదని జనసైనికులు చెప్పకొస్తున్నారు. రాజకీయం అంశాలను బట్టి అందునా ప్రజలకు సంబంధించిన విషయాల్లో పవన్ స్పందిస్తారు తప్పా ఇతర వ్యక్తిగత రాజకీయాల్లో మాట్లాడం మొదటి నుంచి పవన్ కు పెద్దగా ఇష్టం ఉండదని వారు చెబుతున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏదీ చేసినా సంచలనమే అవుతుంది. పవన్ నోరు తెరిచినా అది సంచలనమే.. సైలెంట్ గా ఉన్న సెన్సేషన్ గా మారుతుంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు నోరు తెరుస్తారు, అప్పుడు ఏం అంశంపై మాట్లాడుతారో అని అందరూ వేచి చూస్తున్నారు. మరి పవన్ ఎప్పుడు మాట్లాడుతారు, ఏం మాట్లాడుతారో మాత్రం వేచి చూడాల్సిందే..!
Also Read: Secretariat: సోషల్ మీడియాలో లైక్‌లు, పోస్టులు, కామెంట్లు చేయొద్దు.. పోలీసులకు ప్రభుత్వం వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook