Jewel Thief: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న‘జ్యువెల్ థీఫ్’.. ఆడియోకు సూపర్ రెస్పాన్స్..

Jewel Thief: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే ఆయా చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ  నేపథ్యంలో తెరకెక్కిన మరో చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల చేసారు. దానికి  మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 27, 2024, 07:55 AM IST
Jewel Thief: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న‘జ్యువెల్ థీఫ్’.. ఆడియోకు సూపర్ రెస్పాన్స్..

Jewel Thief: పీఎస్ నారాయణ దర్శకత్వంలో శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై  మల్లెల ప్రభాకర్ నిర్మించిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’.  Beware of Burglar అనేది స‌బ్ టైటిల్.  సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా నటించారు. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఎంఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన సాంగ్స్ కు  మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాంకాక్, థాయిలాండ్ లో పాటలను పిక్చరైజ్ చేశారు. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొంది. అంతేకాదు సెన్సార్ పూర్తి చేసుకొని వారి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు సెన్సార్ వాళ్లు  ఈ చిత్రానికి ‘యూ/ఏ’ స‌ర్టిఫికెట్ జారీ చేసారు. నవంబర్ 8న విడుదల చేస్తున్నారు.ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టీన‌టులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి నటించారు.

హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిని నేను. ఆయన ప్రేరణతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను.  'జ్యువెల థీఫ్' అంటే నగల దొంగ. డిఫరెంట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నారు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. సెన్సార్ బోర్డు ప్ర‌శంస‌లు సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయన్నారు. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ జనరేషన్ ఆడియన్స్ కు ఈ సినిమా కనెక్ట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.  ఎంఎం శ్రీలేఖ అందించిన సంగీతం వినసొంపుగా ఉందన్నారు. ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప్రేమ గారితో క‌లిసి ఈ సినిమా చేయ‌డం ఆనందంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

నటీనటులు:
హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, స‌మ్మెట గాంధీ, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి, హీరోయిన్ నేహా దేశపాండే, ఆనంద చక్రపాణి, జెన్నీ, మేక రామ కృష్ణ, వైజాగ్ జగదీశ్వరి, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, అప్పాజి, కాట్రగడ్డ సుధాకర్, జంగారెడ్డి, వెంకట రమణారెడ్డి, శ్రావణి, శ్వేత రెడ్డి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పీఎస్ నారాయణ.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News