swamijis places feet on shiva linga in Karnataka: సాధారణంగా మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వంను పాటిస్తుంటాం. హిందు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు అన్ని మతాల వారు కూడా సోదరభావంతో ఉంటాం. ఒకర పండుగలను మరోకరు గౌరవించుకుంటారు. అదే విధంగా ఏదైన పండుగలు, వేడుకలు ఉత్సవాలు జరిగిన కూడా , ఒకరి ఇళ్లలోని మరోకరు వెళ్లుంటాం. అందరి దేవుళ్లు ఒక్కేనంటూ.. ఎవరి మనోభావాలకు ఇబ్బంది కల్గకుండా, అందరిని కలుపుకుని వెళ్తుంటాం. కానీ కొందరు మాత్రం.. సమాజంలో ఏదోరకంగా గొడవలు క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
सारे हिन्दू धर्म के कथित ठेकेदार मौन है!
ये कौन निकृष्ट है जो भगवान भोलेनाथ के शिवलिंग का अपमान कर रहा है।
ऐसा कुकृत्य तो आज तक किसी राक्षस ने नहीं किया!
भाजपा वाले वीएचपी वाले संघ वाले मौन क्यों है? pic.twitter.com/0kIwTvmb47— Surendra Rajput (@ssrajputINC) September 15, 2024
ఇటీవల కాలంలో కొంత మంది దొంగ స్వామిజీలు, పూజల పేరిట మోసాలు చేస్తున్నారు. ఈ మతం, ఆమతం అన్నికాకుండా.. అన్ని మతాలలో కూడా ఇలాంటి వారు లేని పోని మాటలు చెబుతూ అమాయకుల్ని మోసం చేస్తున్నారు. కొన్ని చోట్ల వారు చేసే పనుల వల్ల గొడవలకు బీజం పెట్టేవిలా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఒక షాకింగ్ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తివివరాలు..
కర్ణాటకలోని చిత్తాపూర్ సెడమ్ మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంచుగుహా హిరామఠానికి సిద్దవీర శివాచర్య స్వామి మఠాధిపతి ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన పని మాత్రం వివాదస్పదంగా మారింది. ఆయన తనకు తాను. దేవుడిగా ప్రకటించుకుని ఏకంగా శివలింగం మీద కాళ్లు పెట్టారు. అంతేకాకుండా.. అక్కడ కొంత మంది భక్తులు.. ఇతని పాదాల మీద నీళ్లు పొసి, పత్రి ఎక్కించి మరీ పూజలు సైతం చేస్తున్నారు.
Read more: Radhika merchant: మామతో గొడవకు దిగిన రాధిక మర్చంట్.?.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..
అతగాడు.. శివలింగం మీద రెండు కాళ్లను పెట్టాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందువులు దైవంగా కొలిచే శివయ్యమీద పాదాలు పెట్టడం ఏంటని ఫైర్ అవుతున్నారు. బీజేపీ, వీహెచ్ఫీ, హిందుపరిషత్ సంఘాలు, వెంటనే ఇతగాడిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మాత్రం కన్నడనాట వివాదంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.