Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉపవాస దీక్ష చేపడుతున్నారా.. అయితే పాటించాల్సిన నియమాలు ఇవే

Janmashtami 2024 Fasting : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీరు ఉపవాసం దీక్ష చేపట్టాలని సంకల్పం తీసుకున్నారా అయితే మీరు పాటించాల్సిన నియమాలు అదేవిధంగా చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Aug 25, 2024, 10:18 PM IST
Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉపవాస దీక్ష చేపడుతున్నారా.. అయితే పాటించాల్సిన నియమాలు ఇవే

Janmashtami 2024 Fasting Rules: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండడం అనేది తమ శబ్దాసక్తులకు ప్రతీకగా భావిస్తుంటారు ఈ పర్వదినం రోజున శ్రీకృష్ణ పరమాత్ముని తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఒక్కపొద్దు ఉండడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం ముఖ్యంగా ఈ రోజున భక్తులు సాత్విక ఆహారం తీసుకుంటారు అలాగే మరికొద్దిమంది ఉపవాసం చేసుకుంటారు అయితే ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో వారు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తద్వారా శ్రీకృష్ణ పరమాత్ముని కరుణాకటాక్షా వీక్షణలను పొందవచ్చు.

సంకల్పం:

జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండే భక్తులు మొదటగా సంకల్పం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం ఉదయం లేవగానే నదీ స్నానం చేసిన అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహం ముందు సంకల్పం తీసుకోవాల్సి ఉంటుంది. భోజనం చేయకుండా ఉండేందుకు సంకల్పం తీసుకోవాల్సి ఉంటుంది.

పూజ:

ఉపవాసం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మునికి పూజ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత చిన్ని కృష్ణుడి వెండి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి దానికి పుష్పాలు చందనము అగరవత్తులు సమర్పించి ధ్యానం చేయాల్సి ఉంటుంది. 

Also Read : Janmashtami 2024: జన్మాష్టమి సందర్బంగా హైదరాబాద్ లో దర్శించుకునే  శ్రీకృష్ణుడి దేవాలయాలివే

శ్రీకృష్ణ పరమాత్ముని భజనలు :

ఉపవాసం సమయంలో భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముని భజనలు చేయవచ్చు లేదా తమకు నచ్చిన పనులను చేయవచ్చు అయితే ఈ సమయంలో ఎవరితోనూ కలహం పడరాదు అలాగే ఎలాంటి దుర్భాషలు ఆడకూడదు మనసులో ఎల్లవేళలా శ్రీకృష్ణుడి జపం చేస్తూ ఉండాలి. 

సాత్విక ఆహారం:

అయితే ఎవరైతే ఉపవాసం ఉండరో వారు ఈరోజు సాత్విక ఆహారం తినవచ్చు సాత్వికాహారం అంటే పూర్తిగా శాఖాహారము అందులో కూడా ఎలాంటి తామసిక పదార్థాలు అంటే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వంటివి లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది అలాగే ఈరోజు మీ కుటుంబ సభ్యులు ఎవరు మద్యం సేవించకూడదు. 

ఉద్వాసన:

ఉపవాసం సాయంత్రం వేళ ఉద్వాసన చేయాల్సి ఉంటుంది. సాయంకాలం శ్రీకృష్ణ పరమాత్మునికి హారతి ఇచ్చి అనంతరం ఉపవాసం వదలాల్సి ఉంటుంది ఉపవాసం అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రసాదం స్వీకరించాల్సి ఉంటుంది అలాగే పండ్లు పాలు వంటివి తీసుకోవచ్చు. 

మద్యం సేవించకూడదు:

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మద్యం సేవించకూడదు. అలాగే మాంసాహారం కూడా సేవించకూడదు. ఇతరులను మోసం చేయడం వంటి పనులు చేయకూడదు. అలాగే జీవులను హింసించ కూడదు ముఖ్యంగా గోవులను అసలు హింసించ కూడదు.

Also Read : Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News