Badlapur Molestation Case : మహారాష్ట్రాలోని థానే జిల్లా బద్లాపూర్‌లో ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు దాడికి దిగారు. దీని ప్రభావం లోకల్ రైళ్లపై కూడా పడింది. బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో పలు లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. నిరసన తెలుపుతున్న ప్రజలు రైల్వే ట్రాక్‌పైకి వచ్చారని సీపీఆర్వో తెలిపారు. దీంతో అంబర్‌నాథ్, కర్జాత్ మధ్య అప్, డౌన్ లైన్‌లలో స్థానిక సర్వీసులు నిలిచిపోయాయి. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐదు రైళ్లు స్టేషన్ లోనే నిలిచిపోయాయి. బద్లాపూర్‌లో నాలుగు రైళ్లు నిలిచి ఉండగా, ఒక రైలు దారి మళ్లించారు. దీంతో లోకల్ రైళ్లలో ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తి వివరాలు చూస్తే..
ముంబై సమీపంలోని బద్లాపూర్లో ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు 4ఏండ్ల చిన్నారులపై అత్యాచారం ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అదే స్కూల్లో పనిచేస్తున్న స్వీపర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 12,13 తేదీల్లో వరుసగా ఈ ఘటనలు జరిగినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో నేడు బద్లాపూర్ లో బంద్ పాటించారు.
స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాల దగ్గరకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాలకు వచ్చే అమ్మాయిల భద్రతపై సమాధానాలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ బంద్ కు అన్ని వర్గా లనుంచి పెద్దెత్తున మద్దతు లభించింది. బస్ డ్రైవర్లు, స్థానిక దుకాణదారులు, రాజకీయ నాయకులు కూడా ఈ బంద్ లో పాల్గొన్నారు.
WATCH | Protest outside Adarsh Vidya Mandir, Badlapur after 2 nursery kids face alleged sexual assault by male attendant#Mumbai #Badlapur #Protest pic.twitter.com/cUdQZnsGhF
— Free Press Journal (@fpjindia) August 20, 2024
ఈ ఘటన ఎలా బయటకు వచ్చింది?
బాధిత చిన్నారుల్లో ఒకరు పాఠశాలకు వెళ్లనంటూ మారం చేయడం అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మరో బాలిక కూడా ఇలాగే జరిగినట్లు తన తల్లిదండ్రులకు చెప్పింది. పాఠశాలలో పనిచేస్తున్న వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఫిర్యాదు నమోదు చేసేందుకు దాదాపు 12గంటల సమయం వారికి బయటన నిలబెట్టడం మరింత ఆగ్రహానికి కారణమైంది. పాఠశాల ముందు ఆందోళణ చేపట్టిన ప్రజలు అనంతరం రైల్వే స్టేషన్ కు చేరుకుని పట్టాలపై కూర్చుండి నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడంపై ఆందోళనకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాఠశాల యాజమాన్యం ముందుకు వచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాలికల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Badlapur News: నర్సరీ చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడి.. బద్లాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు