Delhi UPSC aspirants death: ఢిల్లీ కోచింగ్ సెంటర్ వరద ఘటన.. 13 కోచింగ్ సెంటర్ల పై కొరడా.. మరో ఐదుగురి అరెస్టు..

Delhi coaching centre flooding : ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి సివిల్స్‌ కోసం వచ్చిన ముగ్గురు విద్యార్థులు వరద నీళ్లలో చిక్కుకుని విగత జీవులుగా మారిపోయారు. శనివారం రాత్రి సెల్లార్ లో స్టడీ హల్ లో ఉండగా.. ఒక్కసారిగా  వరద నీరు రావడంతో వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jul 29, 2024, 08:35 PM IST
  • ఢిల్లీ వరద ఘటనతో మేల్కొన్న అధికారులు..
  • కోచింగ్ సెంటర్లపై చర్యలు..
Delhi UPSC aspirants death: ఢిల్లీ కోచింగ్ సెంటర్ వరద ఘటన.. 13 కోచింగ్ సెంటర్ల పై కొరడా.. మరో ఐదుగురి అరెస్టు..

Delhi ias coaching centre flooding incident: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది. ప్రతిష్టాతకమైన సివిల్స్ లో విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకుని ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు విద్యార్థులు విగతజీవులగా మారిపోయారు.  ప్రస్తుతం ఈ ఘటన యాతవ్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లోని ఓల్డ్ రాజేంద్రనగర్లో భవనంలోని సెల్లార్లో రావూస్ సివిల్స్ సర్వీసెస్ అకాడమి నిర్వహివస్తున్నారు. దీంతో శనివారం ఒక్కసారిగా వరద పొటెత్తింది. దీంతో అక్కడ సెల్లార్ లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరదనీరు చొచ్చుకుని రావడంవల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

Read more: Snake: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి .. వీడియో వైరల్..

ఘటనలో.. తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డాల్విన్ (24)లు చనిపోయారు.  అయితే కోచింగ్ సెంటర్ ఎదురు రోడ్డుపై భారీగా వరద నీరు చేరగా ఓ SUV వాహనం నీటిలో వేగంగా వెళ్లడంతో.. వాటర్ ఫోర్స్ కి కోచింగ్ సెంటర్ గేటు కూడా ఊడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున నీరు సెల్లార్లోకి ప్రవేశించి ప్రమాద తీవ్రతను పెంచిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఢిల్లీ సర్కారు పై విమర్శలు గుప్పిస్తున్నారు. సరైన ప్రమాణాలు పాటించకుండా.. సివిల్స్ సర్వీసెస్ అకాడమిని నిర్వహిస్తున్న వారిపై విద్యార్థులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. కొందరు నేతలు  ఆప్ ను ఏకీపారేస్తున్నారు.  

రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్లక్ష్యం ముగ్గురు సివిల్స్ విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది.  ఇప్పటికే రావూస్ కు సంస్థకు చెందిన ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. తాజాగా, మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  ఈనేథ్యంలో ఢిల్లీలోని మరిన్ని కోచింగ్ సెంటర్ లపై అధికారులు తనిఖీలు చేపట్టారు.  సెంట్రల్ ఢిల్లీలోని పాత రాజిందర్ నగర్ వద్ద ఉన్న పలు కోచింగ్ సెంటర్లను ఆదివారం పరిశీలించారు. వీటిలో 13 కోచింగ్ సెంటర్లు సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు.  

వెంటనే అధికారులు.. ఆ కోచింగ్ సెంటర్లకు సీల్ వేశారు. అధికారులు తాళం వేసిన స్టడీ సర్కిల్స్ లలో..  ఐఏఎష్ గురుకుల్, చాహల్ అకాడమీ, ప్లూటుస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, ఐఏఎస్ సేతు, టాపర్స్ అకాడమీ, దైనిక్ సంవాద్, సివిల్స్ డైలీ ఐఏఎస్, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్య గురు, గైడెన్స్ ఐఏఎస్, ఈజీ ఫర్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు అధికారులు తాళాలు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ మేయర్ షెల్లీ  ఒబరాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.  పై కోచింగ్ సెంటర్లన్ని నిబంధలకు విరుద్దంగా ఉండటం వల్ల సీల్ చేసినట్లు వెల్లడించారు.

శనివారం రాత్రి సెల్లార్‌లోకి వరద నీటిలో ఊపిరాడక తానియా సోనీ, శ్రేయా యాదవ్, నవీన్ డెల్విన్‌లు ప్రాణాలు కోల్పోయారు.  బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన తానియా సోనియా కుటుంబం.. ప్రస్తుతం తెలంగాణలోని మంచిర్యాలలో ఉంటున్నట్లు సమాచారం. ఢిల్లీ వర్సిటీ మహారాజా అగ్రసేస్ కాలేజీ మహిళా హాస్టల్‌లో ఉంటూ.. నెల కిందటే రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో చేరింది.

Read more: Paris Olympics 2024: ఒలింపిక్స్ సత్తాచాటిన మనుబాకర్.. భారత్ కు తొలిపతకం..

అదే విధంగా.. యూపీలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయా యాదవ్.. అగ్రి కల్చరల్ బీఎస్పీ పూర్తిచేశారు. రెండు నెలల కిందటే ఈ కోచింగ్ సెంటర్‌లో చేరిన ఆమె.. అంతకు ముందు షాదీపూర్‌లోని పీజీ హాస్టల్‌లో ఉండేవారని సమాచారం. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచ ఆర్ట్స్ అండ్ ఈస్థటిక్స్‌లో పీహెచ్‌డీ చేసిననవీన్ డెల్విన్ స్వస్థలం కేరళలోని ఎర్నాకులం. 8 నెలల కిందటే నవీన్ సివిల్స్‌ శిక్షణ కోసం రావూస్ స్టడీ సర్కిల్‌లో చేరాడు. ప్రస్తుతం ఈ కుటుంబాలలో తీవ్రవిషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News