Bharatheeyudu 2 Pre Release Business: ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !

Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోయినా.. భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెసే జరిగింది. తెలుగులో ఈ సినిమా రికార్డు బ్రేక్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 10, 2024, 11:57 AM IST
Bharatheeyudu 2 Pre Release Business: ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !

Bharatheeyudu 2 First Review : గత కొన్నేళ్లుగా హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడం అన్ని భాషల్లో కామన్ అయిపోయింది. ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 28 యేళ్ల క్రితం  తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇపుడు ఆ సినిమాకు సీక్వెల్ గా  ‘భారతీయుడు 2’ సినిమాను  తెరకెక్కించాడు శంకర్. అప్పట్లో తెలుగు సహా వివిధ భాష ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త సబ్జెక్ట్. పైగా హీరో స్వాతంత్య్ర సమరయోధుడు. అప్పటికే సమాజంలో వేళ్లూనుకుపోయిన లంచ గొండితనాన్ని ఎండగట్టాడు. అయితే 28 యేళ్ల తర్వాత అదే సబ్జెక్ట్ తో లంచం కొత్త పుంతలు తొక్కిన విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించాడు శంకర్.

ఇక కమల్ హాసన్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. భారతీయుడు లో రెండు పాత్రల్లో మెప్పించిన కమల్ హాసన్.. ఈ సినిమాలో కేవలం ముసలి పాత్రకే పరిమితమయ్యారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఓ మోస్తరుగా సోసోగా ఉంది. కానీ శంకర్ టేకింగ్, కమల్ హాసన్ నటన ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.

ఈ సినిమాను  సురేశ్ బాబు, ఏషియన్ గ్రూపు సంయుక్తంగా దక్కించుకుంది. ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో రూ. 9 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయినట్టు సమాచారం. ఇక సీడెడ్ (రాయలసీమ)లో ఈ సినిమా రూ. 4 కోట్లు.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా రూ. 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. తెలుగులో ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే దాదాపు రూ. 25 కోట్ల షేర్ రాబట్టాలి. అంటే దాదాపు రూ. 48 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి.

తెలుగులో కమల్ హాసన్ కు ఒకప్పటిలా  పెద్దగా మార్కెట్ లేదు. విక్రమ్ సినిమా కూడా లోకేష్ కనగరాజ్ ఇమేజ్ తో జరిగింది. ఇక ఈ సినిమాకు భారతీయుడు ఫ్యాక్టర్ తో పాటు శంకర్ స్టార్ ఇమేజ్.. కమల్ హాసన్ కూడా తోడు కావడం వల్ల ఈ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.  

విక్రమ్ వంటి సాలిట్ హిట్ తర్వాత కమల్ హాసన్.. రీసెంట్ గా ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించారు. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ మరో హిట్ అందుకుంటారా. లేదా అనేది చూడాలి.

Also read: Mumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News