Whiskey With Mineral Water: మద్యం ప్రియులకు ఈ విషయం తెలుసా.. విస్కీలో మినరల్ వాటర్ మిక్స్‌ చేస్తే..!

Whiskey With Mineral Water: మద్యం ప్రియుల్లో విస్కీని ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే విస్కీలోకి ఏం మిక్స్‌ చేసుకుని తాగాలి..? కొంతమంది సోడాను మిక్స్‌ చేసుకుని తాగుతుండగా.. ఇంకొందరు వాటర్ కలుపుకుంటారు. అయితే మినరల్ వాటర్ మిక్స్‌ చేసుకుని తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

  • Jun 28, 2024, 17:47 PM IST
1 /6

విస్కీని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మద్యం ప్రియులు సేవిస్తున్నారు. విస్కీని తాగే విధానంలో చాలా తేడా ఉంది.  

2 /6

కొంతమంది సోడాతో విస్కీకి కలుకుని తాగుతారు. మరికొందరు వాటర్ కలుపుకునేందుకు ఇష్టపడతారు. అయితే విస్కీలో మినరల్ వాటర్ కలుపుకుని తాగితే.. అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

3 /6

విస్కీని నీరు, సోడా, కూల్‌ డ్రింక్స్, జ్యూస్, మినరల్ వాటర్‌లో మిక్స్ చేసుకుని సేవిస్తున్నారు. అయితే మినరల్ వాటర్‌తో విస్కీ తాగితే.. శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిలు  పెరుగుదలకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.  

4 /6

శరీరంలో సోడియం స్థాయి ఎక్కువగా ఉంటే.. మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చేస్తుందని చెబుతున్నారు.   

5 /6

అంతేకాదు విస్కీలో మినరల్ వాటర్ కలపడం వల్ల నోటి రుచి కూడా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. అంతకంటే ముందు మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హానికరం అని మర్చిపోవద్దు.  

6 /6

గమనిక: ఇక్కడ అందిజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. Zee Telugu News ధ్రువీకరించలేదు.