Kalki 2898 AD Trailer: ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తువున్న భారీ బడ్జెట్ కల్కి2898AD. ఈ చిత్రాన్ని తమకు ఎంతో సెంటిమెంట్ డేట్ అయిన మే 9న విడుదల చేయాలి అనుకున్నారు వైజయంతి మూవీస్. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్స్ ప్రభావం వల్ల సినిమాని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ బయటకి రావడంతో.. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ వేగాన్ని పెంచాలనుకుంటున్నారు ఈ చిత్రం నిర్మాత అశ్వినీ దత్.
అశ్వినీ దత్ టీడీపీ పార్టీకి మొదటి నుంచి తన సపోర్ట్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసిపి పార్టీ కానీ అధికారంలోకి వస్తే తమ సినిమాకి రేట్లు తగ్గిస్తారంటూ..కొంతమంది సాధారణ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టసాగారు. అయితే అశ్వినీ దత్ అదృష్టమా అని..ఏపీలో కూటమి భారీ విజయం సాధించింది. అశ్వినీదత్ గతంలో కూడా అనేకసార్లు కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇపుడు కూటమి గెలవడంతో.. ఖుషి గా ఫీల్ అవుతూ.. తాజాగా కల్కి సినిమా ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసారు.
ఇక అసలు విషయానికి వస్తే కల్కి సినిమా ట్రైలర్ జూన్ 10న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్. మరి దీనికి భారీ ఈవెంట్ చేస్తారా లేకపోతే కేవలం డైరెక్ట్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారా చూడాలి. ఇక ట్రైలర్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ కల్కి ట్రైలర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.
నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె.. హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో బ్యూటీ దిషా పటానీ.. ఒక ముఖ్య పాత్రలో సందడి చేయనుంది. వీరితో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
𝐀 𝐍𝐄𝐖 𝐖𝐎𝐑𝐋𝐃 𝐀𝐖𝐀𝐈𝐓𝐒!#Kalki2898AD Trailer on June 10th. @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/rAPJeHpuRV
— Kalki 2898 AD (@Kalki2898AD) June 5, 2024
Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి