ఆర్మీ కోర్టు సంచలన తీర్పు: మహిళా అధికారిని వేధించిన కేసులో మేజర్ జనరల్ డిస్మిస్

మహిళా వేధింపుల కేసులో ఆర్మీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది

Last Updated : Dec 24, 2018, 12:33 PM IST
ఆర్మీ కోర్టు సంచలన తీర్పు: మహిళా అధికారిని వేధించిన కేసులో మేజర్ జనరల్ డిస్మిస్

మహిళా వేధింపుల కేసులో ఆర్మీ కోర్టు సంచలన తీర్పువెలవరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మేజర్ జనరల్ ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. ఇలాంటి చర్యల విషయంలో ఏమాత్రం రాజీపడబోమని న్యాయస్థానం పేర్కొంది. తాజా తీర్పుతో భారత సైన్యంలో  మేజర్ జనరల్ హోదాలో ఎంఎస్‌ జస్వాల్‌ ఇంటికి పంపించారు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది . తనను వేధిస్తున్నాడంటూ ..మేజర్ జనరల్ హోదాలో ఉన్న ఎంఎస్‌ జస్వాల్‌ పై ఓ కెప్టెన్ స్థాయి మహిళా అధికారిణి  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు ఈ మేరకు స్పందించింది.

ప్రముఖు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథన ప్రకారం రెండేళ్ల క్రితం ఎంఎస్‌ జస్వాల్‌ ను మేజర్ జనరల్ హోదాలో నాగాలాండ్ కు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆయన దేశ రాజధానికి బదిలీ కావడం.. అక్కడే తన కింద పనిచేస్తున్న కెప్టెన్ స్థాయి అధికారిణిని తన ఆఫీసుకు జస్వాల్ పిలిపించుకున్నాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇదిలా ఉండాగా నిందితుడు ఎంఎస్‌ జస్వాల్‌ ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తున్నారు. అంతర్గత వర్గ పోరులో భాగంగా తనను బలిచేశారనీ .. దీనిపై ఎగువ కోర్టులో అప్పీల్ చేస్తానని జస్వాల్ తరఫున న్యాయవాది ప్రకటించారు

Trending News