Trinamool Congress Manifesto: దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ప్రాంతీయ, జాతీయ పార్టీలు ప్రజలను పసన్నం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు బోలెడు హామీలు ఇస్తున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా గ్యాస్ సిలిండర్ల హామీ అందరినీ ఆకర్షిస్తోంది. ఏడాదికి పది గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది.
Also Read: Raaj Kumar Anand: ఢిల్లీ రాజకీయాల్లో భారీ కుదుపు.. మంత్రి పదవికి కీలక నాయకుడు రాజీనామా
పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుపొందాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో వీలైనన్ని ఎక్కువ ఎంపీలు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలోనే కోల్‌కత్తాలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండియా కూటమి' ప్రభుత్వం ఏర్పడితే పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేరువ చేస్తామని ఎంపీ ఓబ్రెయిన్ ప్రకటించారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వివరించారు.
Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్.. ఇలా ప్రచారం
- దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం.
- పేదలకు ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తాం. ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ చేస్తాం.
- సామాన్యుడికి భారమైన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తాం. దీనికోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తాం.
- దేశానికే ప్రమాదకరమైన సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను రద్దు.
- ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజుల పాటు పని కల్పన. రోజుకు రూ.400 చొప్పున వేతనం చెల్లింపు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఇచ్చే ఉపకార వేతనాలు మూడు రెట్లు పెంపు
కాగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. కానీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌తో కలిసి తృణమూల్ పోటీ చేయడం లేదు. సొంత రాష్ట్రంలో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఓట్లు చీలకుండా బీజేపీని చావుదెబ్బ తీసేందుకు మమతా బెనర్జీ ఈ వ్యూహం రచించారు. మరి మమత వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది కొన్ని వారాల్లో తెలియనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Lok Sabha Elections: ప్రజలకు గుడ్‌న్యూస్.. 10 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఫ్రీ