RR vs GT Highlights: వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు పరాభయం ఎదురైంది. ఈ సీజన్లో జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. ఫలితంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లు తిరుగులేకుండా ఆధిపత్యం చెలయిస్తున్న రాజస్థాన్‌ను చివరి బంతిలో గుజరాత్ బోల్తా కొట్టించింది. అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆర్ఆర్పై జీటీ సంచలన విజయం సాధించింది.
Also Read: PBKS vs SRH Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం.. పంజాబ్ ఓటమి
ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతం జరిగింది. తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఓడించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ దూకుడైన బ్యాటింగ్‌తో గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. ఈ గెలుపుతో హ్యాట్రిక్ ఓటమి నుంచి గుజరాత్ గట్టెక్కగా.. వరుసగా నాలుగు విజయాలతో సత్తా చాటుతున్న రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమిని చవి చూసింది.
టాస్ నెగ్గి ఫీల్డింగ్‌కు దిగి రాజస్థాన్ నిర్దేశించిన 197 లక్ష్యాన్ని తీవ్రంగా శ్రమించి ఆఖరి బంతిలో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ ఆలస్యంగా జరిగినా.. వరుసగా వికెట్లు పడుతున్నా జీటీ అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. 20 ఓవర్లలో ౭ వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా దిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో మరోసారి అదరగొట్టగా.. సాయి సుదర్శన్ గిల్‌కు సహాయం అందించి 35 పరుగులు సాధించాడు. గిల్ మాత్రం బ్యాటింగ్‌లో తిరుగులేదనిపించాడు. 44 బంతుల్లో 72 పరుగులు సాధించి కోహ్లీ రికార్డును అధిగమించాడు. 6 ఫోర్లు, 2 సిక్స్‌లు సాధించాడు.
మిడిలార్డర్లో వచ్చిన మాథ్యూ వేడ్ (4), అభినవ్ మనోహర్ (1), విజయ్ శంకర్ (16) పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. రాహుల్ తెవాటియా (22), షారుక్ ఖాన్ (14) జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆఖరిలో బ్యాటింగ్‌కు దిగిన బౌలర్ రషీద్ ఖాన్ బ్యాటింగ్‌తోనూ సత్తా చాటాడు. 24 పరుగులు సాధించి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు.
Also Read: CSK vs KKR Highlights: కోల్కత్తా దూకుడుకు చెన్నై బ్రేక్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గట్టెక్కిన సీఎస్కే
మరోసారి యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అద్భుత బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ మోస్తరు స్కోర్ సాధించింది. కెప్టెన్ సంజు శాంసన్‌తో కలిసి రియాన్ పరాగ్ రెచ్చిపోయి ఆడాడు. దీని ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (24) కొంత పరుగులు చేయగా.. జోస్ బట్లర్ 8 పరుగులకు పరిమితమయ్యాడు. అనంతరం గ్రౌండ్లోకి దిగిన సంజు శాంసన్ 68 పరుగులతో సత్తా చాటాడు. ఈ సీజన్లో సత్తా చాటుతున్న రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 స్కోర్ సాధించాడు. ఐదు సిక్స్‌లు, 3 ఫోర్లు సాధించి బీభత్సం సృష్టించాడు. షిమ్రాన్ హెట్మెయిర్ 13 పరుగులకు పరిమితమయ్యాడు. రాజస్థాన్‌ను పరుగులు సాధించకుండా గుజరాత్ బౌలర్లు నియంత్రించలేకపోయారు. వికెట్లు తీయడంలో ఒక్క కుల్దీప్ సేన్ మినహా మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు. కుల్దీప్ సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter