How To Use Chia Seeds For Weight Loss: మనలో చాలా మంది సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ శరీర బరువును నియంత్రించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కిలో బరువు కూడా తగ్గలేకపోతున్నారు. అధిక బరువు ఉన్నవారు ఎంత సులభంగా బరువును తగ్గించుకుంటే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది అధిక బరువు పెరగడం కారణంగా గుండెపోటు, మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు ఆహారాల్లో చియా విత్తనాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు బరువును తగ్గించడమే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
చియా విత్తనాలను ఇలా వినియోగించండి:
1. చియా సీడ్ పుడ్డింగ్:
రాత్రి ఒక గ్లాసు పాలు లేదా పెరుగులో ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను నానబెట్టండి. ఉదయం మీకు ఇష్టమైన పండ్లు, కాయలు, లేదా తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
2. చియా సీడ్ స్మూతీ:
చియా సీడ్ స్మూతీని తాగడం వల్ల కూడా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. స్మూతీలో ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను కలిపి తీసుకోండి.
3. చియా సీడ్ వాటర్:
ప్రతి రోజు చియా సీడ్ వాటర్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
4. చియా సీడ్ సలాడ్ టాపింగ్:
ప్రతి రోజు సలాడ్స్ తీసుకునే క్రమంలో టేబుల్ స్పూన్ చియా విత్తనాలను చల్లుకోని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.
5. చియా సీడ్ బేకింగ్:
బేకింగ్ రెసిపీలలో చియా సీడ్స్‌ను వినియోగించి తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజు తీసుకునే బేకింగ్ కేక్స్‌లో వేసుకుని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి