VLF Station: నేవీ రాడార్ స్టేషన్‌ ఏర్పాటుకు ముందడుగు.. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్మీ చర్చలు సఫలం

Telagana Radar Station: భారత నావికా దళానికి తెలంగాణ మరో విశిష్ట సేవలు అందించనుంది. నౌకలు, జలాంత్గరాములకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం తెలంగాణలో ఒక రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు కానుంది. దశాబ్దా కాలంగా కొనసాగుతున్న ఈ స్టేషన్‌ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. భూముల కేటాయింపు, నిధుల చెల్లింపు ప్రక్రియకు పీటముడి వీడింది. 2027లో ఈ కేంద్రం అందుబాటులోకి రానుండడం విశేషం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 24, 2024, 07:34 PM IST
VLF Station: నేవీ రాడార్ స్టేషన్‌ ఏర్పాటుకు ముందడుగు.. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్మీ చర్చలు సఫలం

Navy Officers meet: భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో  వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం  వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. ఈ స్టేషన్‌ను వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో నావికా దళం అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూమికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపారు.

ఈ కేంద్రం ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్‌లపై జాప్యం ఉన్న నేపథ్యంలో బుధవారం అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కమాండోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈఓ రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ తదితరులు రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఏర్పాటుపై ఉన్న అనుమతులు, పరిమితులపై చర్చించారు. తాజా సమావేశంతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దేశంలోనే రెండో స్టేషన్‌
తెలంగాణలో ఏర్పాటవుతున్న ఈ రాడార్‌ స్టేషన్‌ దేశంలోనే రెండోది. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. 1990 నుంచి ఈ స్టేషన్‌ నావికా దళానికి సేవలు అందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. 2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అనుమతులు, భూముల కేటాయింపుపై వివాదం ఏర్పడడంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో బ్రేక్‌ పడింది. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ ప్రాజెక్టుపై నీలిమేఘాలు అలుముకున్నాయి.

వివాదానికి తెర
తాజాగా వాటిని పరిష్కరించిన నావిక దళం అధికారులు ఈ కేంద్రం ఏర్పాటుపై ముందడుగు వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని  కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఓ ఆలయం ఉండడంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా నేవీ చర్యలు చేపట్టింది. 

నేవీ యూనిట్‌లో దాదాపు 600 మంది నావికాదళంతోపాటు ఇతర సాధారణ పౌరులు కూడా ఉంటారు. టౌన్‌షిప్‌లో 2,500 మంది నుంచి 3 వేల మంది నివసించనున్నారు. దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు. 2027 నాటికి ఈ సెంటర్‌ పనులన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Also Read: KTR Counter Attack: హామీలు నెరవేర్చని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలి: కేటీఆర్‌

Also Read: Parliament Elections: కాంగ్రెస్‌కు మమత భారీ షాక్‌.. బెంగాల్‌లో కటీఫ్‌.. ఢిల్లీలో దోస్తీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News