Sompu Water Benefits: సోంపు కషాయంతో.. అధిక బరవు సమస్యకు చెక్‌ !

Fennel Seeds: నేటి కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఇష్టంగా తినే జంక్‌ ఫూడ్‌, వ్యాయామం చేయకపోవడం, ఆహార అలవాట్లు. బరువు ఎక్కువ ఉండటం కారణంగా వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కోసం మీరు ఎటువంటి ఖర్చు లేకుండా బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు  అంటున్నారు. ఇప్పుడు దీనికి గురించి మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2023, 09:40 PM IST
 Sompu Water Benefits:  సోంపు కషాయంతో.. అధిక బరవు సమస్యకు చెక్‌ !

Fennel Seeds: ప్రస్తుతకాలంలో చాలా మంది అధిక ఖర్చుతో బరువు సమస్యకు చెక్‌ పెట్టవచ్చని అనుకుంటున్నారు. కానీ దీనివల్ల ఎలాంటి మార్పు రాదని నిపుణులు అంటున్నారు. దీనికోసం మందులను కూడా వాడుతూ ఉంటారు.  అయితే మందుల‌ను వాడడం వ‌ల్ల బ‌రువు త‌గ్గినప్ప‌టికి.. తీవ్రమైన అనారోగ్య సమస్యల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

సహజ సిద్దంగా బరువును తగ్గించుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం సోంపు గింజలు ఎంతో సహాయపడుతాయి. సోంపు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. బరువు త‌గ్గాల‌నుకునే వారు  ప్రతి రోజు సోంపు గింజ‌ల‌ను వాడ‌డం అలవాటుగా చేసుకోవాలి. అయితే ఈ గింజలని కషాయంగా కూడా చేసుకోవచ్చు.కషాయం ఎలా చేసుకోవాల్సి ఉంది అనే ఆంశంపై ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: Health Remedies: ఆవనూనెతో అద్భుతాలు, ఈ 5 పదార్ధాలు కలిపి రాస్తే అన్ని సమస్యలు మాయం

 సోంపు గింజ‌ల‌తో కషాయం చేసుకోండి ఇలా..

ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజ‌ల‌ను వేసి నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ  సోంపు  నీటిని  గిన్నెలో పోసి మ‌రిగించాలి. అనంతరం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీని ప్రతిరోజూ పరగడుపున తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా దీంతో పాటు వ్యాయామం చేయాలి. ఈ విధంగా సోంపు గింజ‌ల నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది.

Also Read: Health Tips: జలుబు.. దగ్గు నుంచి ఉపశమనం ఇచ్చే వంటింటి చిట్కాలు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News