TS Elections: కొల్లాపూర్‌ కా షేర్ కౌన్ హై.. ఉత్కంఠభరితంగా పోటీ

Kollapur Assembly Constituency: గత ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని కొల్లాపూర్ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. గెలిచిన ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు పార్టీలు మారడంతోపాటు బీజేపీ బలం పుంజుకోవడంతో పోరు ఉత్కంఠభరితంగా ఉండనుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 3, 2023, 03:09 PM IST
TS Elections: కొల్లాపూర్‌ కా షేర్ కౌన్ హై.. ఉత్కంఠభరితంగా పోటీ

Kollapur Assembly Constituency: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టించనున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు అన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్‌పైనే ఎక్కువ దృష్టి సాధిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో 13 స్థానాలలో బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. ఒక్క కొల్లాపూర్‌ స్థానంలో కాంగ్రెస్‌ గెలిచింది. మరి ఈసారి కొల్లాపూర్‌లో పగా వేసేదెవరు..? బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా..? కాంగ్రెస్ తిరిగి గెలుపొందుతుందా..? బీజేపీ సత్తాచాటుకుంటుందా..? కొల్లాపూర్ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్..
 
ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌పై ఎక్కువగా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ గెలవడంతో.. ఈసారి కూడా అక్కడ పాగా వేయాలని హస్తం పార్టీ  నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎల్లేని సుధాకర్‌రావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన హర్షవర్థన్‌రెడ్డి కొన్ని రోజులకే బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సారి కూడా ఆయనే బరిలో దిగుతున్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి మరోసారి గెలిచేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో వెళ్లినందుకు కొంత క్యాడర్‌ తగ్గిందనే టాక్‌ వినిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు బీఆర్‌ఎస్‌లోని నాయకులకే ఇచ్చారని.. ప్రజల్లో కొంత అసహనం నెలకొంది. ఇదే అస్త్రంగా కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ చేపట్టబోయే పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో నాలుగు సార్లు గెలిచిన జూపల్లి.. మరోసారి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగాను, తరువాత కాంగ్రెస్‌ నుంచి రెండు సార్లు, బీఆర్‌ఎస్‌ నుంచి ఒకసారి జూపల్లి గెలిచారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన జూపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డిపై ఓడిపోయారు. బీరం బీఆర్‌ఎస్‌లో చేరడంతో జూపల్లి బీఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న జూపల్లి.. ఏకంగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతో కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 

ఇక బీజేపీ విషయానికి కొస్తే గత ఎన్నికల్లో  ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీకి 13వేల పైగా ఓట్లు వచ్చాయి. ఎల్లేని సుధాకర్‌రావు నియోజకవర్గంలో స్వంతంగా KYF సంస్థను పెట్టి విద్యార్థులకు, ప్రజలకు సేవ చేస్తున్నారు. దీంతో మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్‌రావుకు మొదటి ఎన్నికల్లోనే 13 వేల ఓట్లు పడ్డాయి. మరోసారి బీజేపీ ఎల్లేనికి టికెట్‌ ఇవ్వడంతో తన అదృష్టాన్ని పరిష్కించుకోవడానికి రంగం సిద్దం చేసుకున్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఊరూరా సమావేశాలు ఏర్పాటు చేస్తూ బీజేపీ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఎల్లేని కోరుతున్నారు. తాను అధికారంలో లేక పోయినా సోమసిల్ల-సిద్ధేశ్వరం బ్యారేజ్‌కు నిర్మాణానికి కావల్సిన అనుమతుల కోసం కేంద్రంతో ఒప్పించానని.. అధికారం తనకు ఇస్తే నియోజకవర్గ ప్రజలకు ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పేలా ప్రయత్నిస్తానని ఎల్లేని ప్రజలను కోరుతున్నారు. మరి త్రిముఖ పోరులో ప్రజలు ఎవరికి గెలిపిస్తారో చూడాలి. 

Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  

Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News