Infinix Smart 8 Prices: త్వరలోనే మార్కెట్లోకి 5000mAh బ్యాటరీతో Infinix మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!

Infinix Smart 8 Prices: Infinix బ్రాండ్‌ త్వరలోనే మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. Infinix స్మార్ట్ 8 పేరుతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2023, 12:33 PM IST
Infinix Smart 8 Prices: త్వరలోనే మార్కెట్లోకి 5000mAh బ్యాటరీతో Infinix మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!

Infinix Smart 8 Prices: Infinix బ్రాండ్‌కి మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ టెక్‌ కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ టీవీలను, మొబైల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ఈ టెక్‌ కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే డెడ్‌ చీప్‌ ధరలోనే మరో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ అతి తక్కవ ధరలో అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ మొబైల్‌ను Infinix స్మార్ట్ 8 పేరుతో లాంచ్‌ చేయనుంది. ఈ మొబైల్‌ Unisoc T606 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8లో ప్రత్యేకత:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ పవర్, వాల్యూమ్ బటన్స్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..ఈ మొబైల్‌ HD Plus 720×1612 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మొబైల్‌ Unisock T606 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఈ మొబైల్‌ 3జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ 13ను కలిగి ఉంటుంది. 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్ ఫోన్‌ 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉన్న 5000mAh బ్యాటరీతో రాబోతోంది. ఈ మొబైల్ ఫోన్‌  FCC సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ ఫోన్  164×76×9 మిమీ కొలతలను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ లాంచింగ్‌ తేదికి సంబంధించిన వివరాలను ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అధికారిక సమాచారం ప్రకారం అతి త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫీచర్లు:
HD ప్లస్ రిజల్యూషన్ 
500 nits బ్రైట్‌నెస్‌
6.6-అంగుళాల IPL LCD డిస్‌ప్లే
IMG8322 GPU
ఆక్టా-కోర్ Unisock SC9863A1 ప్రాసెసర్‌
XOS 12 స్కిన్‌
ఆండ్రాయిడ్ 12 
13 మెగాపిక్సెల్ కెమెరా బ్యాక్‌ కెమెరా
AI లెన్స్
5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
6000mAh బ్యాటరీ
వెనుక-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
10W ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News