Super Fruits for Belly fat : బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే సూపర్ ఫ్రూట్స్

Belly fat reduction : ప్రస్తుత తరానికి అత్యంత పెద్ద సమస్య ఏది అంటే ఒబిసిటీ అనే చెప్పాలి. లావు అవ్వడం ఒక సమస్యని పక్కన పెడితే అన్నిటికన్నా ఇంకా పెద్ద సమస్య పొత్త ఎక్కువ వచ్చేయడం. చిన్నపిల్లలు అని కాదు పెద్దవారు అని కాదు ఇప్పుడు అందరిలోనూ మనం బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీనిని తగ్గించాలని ఎంత ప్రయత్నించినా తగ్గకపోవడం మరో వింత సమస్య. మరి అలాంటి పొట్టని కేవలం కొన్ని ఫ్రూట్స్ ద్వారా తగ్గించుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2023, 12:17 PM IST
Super Fruits for Belly fat : బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే సూపర్ ఫ్రూట్స్

Healthy Fruits for Belly fat :

చాలామంది ఉద్యోగ రీత్యా గంటలు తరబడి కూర్చొని పని చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. హడావిడి జీవన విధానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందికి చిన్న వయసులోనే ఊబకాయం సమస్య ఎక్కువగా మారుతుంది. దీనితో చిన్నపిల్లల నుంచే బాన పొట్ట గమనిస్తున్నాం. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య పెరిగి పెద్దయ్యేకొద్దీ చాలా జట్టులంగా మారుతుంది. ఎన్ని రకాల ఎక్సర్సైజులు డైటింగ్ లో చేసిన చాలా సందర్భాలలో బాన పొట్ట తగ్గడం కష్టమవుతుంది.

పొట్టపై కొవ్వు పెరగడం వల్ల అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తి అవకాశం ఉంది. అందుకే మనం తీసుకునే రోజువారి ఆహారంలో ఆ కొవ్వు కరిగించే గుణం కలిగిన పండ్లను చేర్చుకోవడం ఎంతో అవసరం. ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల క్రమంగా ఈ సమస్య దూరమవడంతో పాటు మనం మన ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు . అనారోగ్యమైన ఆహారం కారణంగానే నేడు చాలామందికి అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతుంది.

పొత్తికడుపు ,నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా తగ్గించడం కూడా చాలా కష్టం. టైట్లో ఎక్ససైజ్ లు ఎన్ని చేసినా ఈ ఉదర స్థూలకాయ  సమస్య అంత త్వరగా తగ్గదు.ముఖ్యంగా మన తీసుకొని ఆహారంలో చేసే చిన్న చిన్న మార్పుల వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఈ ఐదు పళ్ళు మీ డైట్ లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారంలో యాపిల్‌ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఆపిల్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి పలురకాల మంచి జరుగుతుంది.యాపిల్‌లో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫైబర్స్ బెల్లీ ఫ్యాట్ ను వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి.యాపిల్‌లో పుష్కలంగా ఉండే పెక్టిన్‌ ఫైబర్‌ అధిక బరువును తగ్గిస్తుంది.

అవకాడో కూడా పొట్ట కొవ్వును త్వరగా తగ్గించడంలో 
ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవకాడో తీసుకోవడం వల్ల శరీరంలో బరువు నియంత్రణతో ఉండడంతో పాటు పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నిపుణులు జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 12 వారాలపాటు ప్రతిరోజు ఒక అవకాడో తిన్న వ్యక్తులు త్వరగా బరువును తగ్గారు 

విటమిన్ సి పుష్కలంగా ఉండే కివి పండ్లు కూడా బరువును త్వరగా తగ్గించడంలో సహాయపడుతాయి. కివి తీసుకోవడం వల్ల ముఖ్యంగా నడుం భాగంలో పేరుకుపోయిన మొండి కొవ్వు తగ్గుతుంది. మనకు విరివిగా దొరికే జామ పండ్లు కూడా శరీరంలోని అధిక పరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మార్కెట్లో ఎప్పుడు ఎంతో సులభంగా దొరుకుతాయి కాబట్టి తప్పక వీటిని మీ డైట్ లో భాగంగా చేసుకోండి. డయాబెటిస్ పేషెంట్స్ కూడా జామ పండ్లను తినవచ్చు.ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఉండే డైటరీ ఫైబర్ పేగుల్లో పేర్కొన్న చెత్తను బయటకు సులభంగా తొలగిస్తుంది. వీటితో పాటు పళ్ళు రకాల బెర్రీలు కూడా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలోని అధిక కొవ్వును నియంత్రించడంలో బెర్రీలు సహాయపడతాయి.

Also Read:  Kalyan Ram Devil : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి

Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook

Trending News